కొవ్వూరు (ప్రజా అమరావతి);
గత రెండు సంవత్సరాలుగా నాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరున అమలుచేస్తూ మహిళల సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. విజయ విహార్ సెంటర్ లో, మెరక వీధి లో వున్న వై. ఎస్. రాజశఖర రెడ్డి విగ్రహాల కు మంత్రి వనిత పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. మంగళవారం 2 సంవత్సరాలు మంత్రి పదవి పూర్తి అయిన సందర్భంగా క్యాంపు కార్యాలయం లో వై. ఎస్. రాజశఖరరెడ్డి విగ్ర హానికి మంత్రి వనిత పూల మాల వేసి నివాళులర్పించా రు. నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు మధ్య కేకు కట్ కత్తిరించారు. ఈ సందర్భంగా మంత్రి పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంత్రి తానేటి వనిత మా ట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మలో సగం, నాన్న లో సగం తానే అయి జగనన్న మహిళా పక్షపాతిగా సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అన్ని మహిళా పేరిట అమలు చేస్తున్నారన్నారు. 2019 జూన్ 8 న ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో మంత్రిగా తనకు అవకాశం కల్పించి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గా నియమించినందుకు జగనన్న కు ధన్యవాదాలు తెలువుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మహిళల ఆర్ధిక , రాజకీయ, సామాజిక సాధికారికత దిశగా అడుగులు వెయ్యడం జరిగిందన్నారు. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పట్టడం ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్మిన ముఖ్యమంత్రి ఇందుకోసం అమ్మఒడి పధకం ప్రవేశ పెట్టారన్నారు. రాష్ట్రంలో నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చివేశారన్నారు. మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు గా రూపుదిద్దే దిశలో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ చేయూత పధకం కింద ఆర్ధిక సహాయం అందించారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను మహిళల పేరిట అమలు చేస్తున్నామన్నారు. జగనన్న మంత్రి వర్గంలో మహిళా శాఖా మంత్రి గా తనకు గొప్ప అవకాశం కల్పించారని, ఇందుకు జగనన్న మనఃపూర్వక ములుగా కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
జగనన్న ప్రభుత్వం పిల్లల, మహిళ ల ఆరోగ్యం కు పెద్ద పీఠ వేస్తోందని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అంగన్ వాడి కేంద్రాల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ధ్యేయంగా వైఎస్సార్ సంపూర్ణ ఆహార పోషణ పధకం అమలు చేస్తున్నా మన్నారు. ఇందుకోసం ప్రతి ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే నామ మాత్రంగా ఖర్చు చేశారన్నారు. ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి తల్లులు, పిల్లల ఆరోగ్య సంరక్షణ, రక్షణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి , అన్ని తానై బాధ్యత ను జగనన్న తీసుకున్నారని ఆమె తెలిపారు. అందులో భాగంగా మహిళల రక్షణ కోసం దిశా చట్టాన్ని రాష్ట్రంలో తీసుకుని వొచ్చామన్నారు.
మహిళా ల ఆర్ధిక సాధికారికత దిశా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరిట అమలు చేయడం జరిగిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 122 అమలు చేసి , అంటే 90 శాతం పైగా అమలు చేయడం జరిగిందని తానేటి వనిత అన్నారు. హామీలు ఇవ్వని మరో 40 పైగా హామీలను కూడా అమలు చేసామన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ లతో పాటు, అగ్రవర్ణాల పేదలకు కూడా అండగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత అన్నారు. రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ లతో పాటు, అగ్రవర్ణాల పేదలకు కూడా అండగా ఆర్ధికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2024 లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగాలని ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే మద్దత్తు పలుకుతున్నారని ఆమె తెలిపారు. ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పరిపాలనా చేస్తే, ప్రజల మద్దతు పొందవచ్చన్న విశ్వసనీయత తో జగనన్న సంక్షేమ పాలన రాష్ట్రంలో జరుగుతోంది అని ఆమె తెలిపారు. .
రెండు సంవత్సరాలుగా మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో నాకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా కృత జ్ఞతలు తెలువుకుంటు న్నానని మంత్రి తానేటి వనిత పేర్కొన్నా రు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి గంగాధర్ శ్రీనివాస్,ప్ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కొవ్వూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుత్తల భాస్కర్ రావు, కౌన్సిలర్లు అక్షయపాత్ర శ్రీనివాస్ రవీంద్ర ,కంట మని రమేష్, భత్తి నాగ రాజుతోట లక్ష్మీ ప్రసన్న మద్ది పట్ల సాయి గీత , గండ్రోతు అంజలీదేవి, అంకోలు లిల్లి వెంకట పద్మ లీల, పతివాడ నాగమణి, ఉప్పులూరు సూ రిబాబు పోసిన కృష్ణదేవరాయులు.
addComments
Post a Comment