జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన కలెక్టరు కార్యాలయంలో జిల్లా స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం

 విజయనగరం (ప్రజా అమరావతి);

 జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన కలెక్టరు కార్యాలయంలో జిల్లా స్థాయి కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కోవిడ్ మూడో వేవ్ లో పిల్లలపై ప్రభావం చూపనుందనే సంకేతాల నేపథ్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహణ


 కోవిడ్ మూడో వేవ్ ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వైద్య నిపుణులు, జిల్లా అధికారుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్


 మూడో వేవ్ రాకూడదనే ఆశిస్తున్నాం, ఒక వేళ వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై వైద్యులతో చర్చించి ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్


జిల్లాలో పద్దెనిమిది సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 4.82 లక్షల మంది ఉన్నారు: జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్


 మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సర్వే, టెస్టింగ్, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆసుపత్రుల్లో క్లినికల్ మేనేజ్ మెంట్, శిక్షణ, వంటి పలు అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించామని తెలిపిన జిల్లా కలెక్టర్


 కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సమీకరించుకోవలసిన వైద్య పరమైన వసతులు, పరికరాలు, వైద్యులకు సంబంధించి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తాం; జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్


 సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ లు డా.ఆర్.మహేష్ కుమార్, జె. వెంకట రావు, ఐటిడిఎ పి.ఓ. ఆర్. కూర్మనాథ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్.వి.రమణ కుమారి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి. నాగభూషణ రావు, డి.ఆర్.ఓ. ఎం.గణపతి రావు, జిల్లా అధికారులు, వైద్య నిపుణులు.