*అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి*
*పేకాటరాయుళ్ల విషయంలో కఠినంగా ఉండండి*
*గుట్కా స్థావరాలపై నిఘా ఉంచండి*
*మద్యం అక్రమ అమ్మకాలకు తావు లేకుండా చూడండి*
*నేర చరిత్ర ఉన్నవారిపై ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాలి*
*పోలీసులకు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారి ఆదేశాలు*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విడదల రజిని గారు డీఎస్పీ విజయభాస్కర్ గారు, చిలకలూరిపేట రూరల్, పట్టణ సీఐలు సుబ్బారావు గారు, బిలాలుద్దీన్ గార్లని ఆదేశించారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వొద్దని చెప్పారు. ఎక్కడ ఏ తప్పు జరిగినా పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. అసాంఘిక శక్తులు కొద్ది రోజుల నుంచి ఉనికిలోకి వస్తున్నట్లుగా సమాచారం ఉందని, వీరి వెనుక ఎంత పెద్దవ్యక్తులు ఉన్నా సరే ఉపేక్షించొద్దని ఆదేశించారు. పేకాటరాయుళ్ల విషయంలో కఠినంగా ఉండాలని చెప్పారు. మద్యం అక్రమ అమ్మకాలపై నిఘా ఉంచాలని, గుట్కా, పాన్‌పరాగ్ విషయంలోనూ కఠినంగా ఉండాలని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. ఎక్కడైనా జూదం ఆడుతున్న విషయం వెలుగులోకి వస్తే గేమింగ్ యాక్టు కింద చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ గారి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మనమంతా పనిచేయాలని తెలిపారు. నేరచరిత్ర ఉన్నవారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని,తప్పు ఎవరు చేసిన ఉపేక్షించేది లేదు అన్నారు. నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా మన పనితీరు ఉండాలన్నారు.
addComments
Post a Comment