ఆనందయ్య ఔషదం తీసుకున్నా..! వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే..!!

 ఆనందయ్య ఔషదం తీసుకున్నా..!

* వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే..!!


* కరోనా రాకుండా నిబంధనలు పాటించాలి

* కర్ఫ్యూ వేళ ప్రజలు బయట తిరగాకుండా చర్యలు చేపట్టండి..

* టెలీ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి


తిరుపతి (ప్రజా అమరావతి) : రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఆనందయ్య ఔషదం తీసుకున్నాం.. కరోనా మనకు రాదు అనుకుంటే పొరపాటే.. నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. బుధవారం కరోనా కేసులు, అప్రమత్తత పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆనందయ్య ఔషద పంపిణీ అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడారు. ఆనందయ్య ఔషదం తీసుకున్నా తప్పనిసరిగా వాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నిబందలు తప్పక పాటించాలన్నారు. కర్ఫ్యూ అమలు పక్కాగా జరగాలని అధికారులకు సూచించారు.

కరోనా సెకండ్ వేవ్ మనం మరికొంత కాలం ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఇంటి వద్దే ఉంటూ.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలి.. సానిటైజర్ వాడాలి.. బౌతిక దూరం పాటించాలన్నారు.  వీటితో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవడం, యోగ, ప్రాణాయామం ప్రతిరోజూ తప్పనిసరిగా చేయాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయమం ఎలా చేయాలనే పుస్తకాలు, ఆసనాలు కలిగిన చార్ట్ ను ప్రతి ఇంటికి పంపినట్టు తెలిపారు.  వీటి ద్వారా ప్రధానంగా

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే  ప్రయత్నం చేయాలన్నారు. కరోనా రాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ఆనందయ్య ఔషదం ఉపయుక్తంగా పనిచేస్తుందన్నారు. గతేడాది వ్యాధి నిరోధక శక్తిని పెంచే కోడిగుడ్లు, పండ్లు, కూరగాయలు, హోమియో మందులు, ' సి ' విటమిన్ టాబ్లెట్స్, మల్టీ విటమిన్ సిరప్, కషాయం పాకెట్లు, మాస్కులు, శానిటైజర్స్ అందించిన విషయం గుర్తుచేసుకున్నారు.  నేడు కూడా ప్రజలను కరోనా నుంచి కాపాడుకునేందుకు ఆశతో , నమ్మకంతో ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా.. ఆనందయ్య తో తయారు చేయించి ప్రతి ఇంటికి పంపినట్లు వివరించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు కనుక ఇబ్బంది లేదన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగించ వచ్చని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎంపిడిఓ లు తహశీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు..

ఆనందయ్య ఔషదం వాడకం ఇలా..

ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు.. 

ఈ ఔషదాన్ని చింత గింజంత పరిమాణంలో ఉదయం పడగడపన, సాయంత్రం బోజనానికి ముందు ఒక్క రోజు మాత్రం తీసుకోవాలి.. ఈ ఒక్క రోజు 5 నుండి 6 లీటర్ల నీరు తప్పక తాగాలి. ఈ ఔషదం తీసుకున్న రోజు మాంసాహారం తీసుకోరాదు, ధూమపానం చేయరాదు, మద్యం  సేవించరాదు. గర్భిణీ స్త్రీలు, బహిష్టు సమయంలో స్త్రీలు వాడరాదు. ఈ ఔషదాన్ని

 ఫ్రిజ్ లో పెట్టరాదు. ఏ రకమైన వ్యాధికి మందులు వాడుతున్నా..ఈ ఔషదాన్ని తీసుకోవచ్చు.