కోవిడ్ బ్లాక్ ఫంగస్ సోకినవారికి తక్షణమే మెరుగైన చికిత్సను అందించాలి

 విజయవాడ (ప్రజా అమరావతి);




*కోవిడ్ బ్లాక్ ఫంగస్ సోకినవారికి తక్షణమే మెరుగైన చికిత్సను అందించాలి


*..


 *ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవసరమైన ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి*... 


*అవసరమైన వైద్య సిబ్బందిని నియమించేందుకు సిద్ధంగా ఉన్నాం.*. 


*అప్రమత్తంగా ఉండి రోగులకు అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించాలి*..


 *జిల్లా కలెక్టరు జె. నివాస్..* 


 కోవిడ్ బ్లాక్ ఫంగస్ వైరస్ సోకినవారికి తక్షణమే వైద్యసహాయం అందించాలని ఇందుకు ఆక్సిజన్ బెడ్స్ను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వ వైద్యశాలలు వార్డు/గ్రామసచివాలయాల్లో అవసరమైన వైద్యసిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు.


జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యాధికారులు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నిమ్ర ఇంజినీరింగ్ కాలేజీ తదితర కోవిడ్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం జిల్లా కలెక్టరు జె. నివాస్ విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. 


సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాస్పటల్స్ నిర్వహణకు వైద్యాధికారులు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కోవిడ్ కారణంగా మెరుగైన వైద్యసహాయం అందించేందుకు అవసరమైన ఐసియు, ఆక్సిజన్ బెడ్స్న సిద్ధంగా ఉంచాలన్నారు. 


ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధిక సామర్థ్యంగల ఆక్సిజన్ టాంకర్లు హాస్పటల్ లో సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వం వైద్యాధికారులు, సిబ్బందిని నియమించేందుకు సానుకూలంగా ఉందని అవసరమైన సిబ్బంది వివరాల నివేదికను వెంటనే సమర్పించాలని కలెక్టరు సూచించారు.


 బ్లాక్ ఫంగస్ సోకిన రోగులకు వైద్యసహాయం అందించేందుకు ఇయన్నీ జనరల్ ఫిజీషియన్స్ను ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 


జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వివరాలను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్న కలెక్టరు 45 సంవత్సరాలు నిండిన వారికి రెండవ దశ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి కావచ్చిందని మొదటిదశ వ్యాక్సినేషన్ అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ను సిద్ధంగా ఉంచాలని కలెక్టరు సూచించారు.


సమావేశంలో జాయింట్ కలెక్టర్లు యల్. శివశంకర్ (అభివృద్ధి), యస్. నుపూర్ అజయ్ కుమార్ (హౌసింగ్), డియం హెచ్ డా. యం. సుహాసిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శర్మిష్ట, డిసి హెచ్ ఎ స్ డా. జ్యోతిర్మయి, సిద్ధార్థ వైద్యకళాశాల ప్రిన్సిపల్ డా. జి. రాజ్యలక్ష్మి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శివశంకర్, ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్టు కోఆర్డినేటర్ డా. యండి. ఉస్మాన్, శాంపిల్ కలెక్టరు నోడల్ ఆఫీసర్ డా. పి. నవీన్, పిన్నమనేని సిద్ధార్థ కళాశాల ప్రతినిధి శివ, నిమ్ర వైద్యకళాశాల వైద్యులు డా. శివరంజన్, తదితరులు పాల్గొన్నారు.

Comments