శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి


 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి, విజయవాడ ( ప్రజా అమరావతి) :

ప్రస్థుత వర్ధమాన కాలములో కరోనా తీవ్రత ఉదృతముగా ఉన్నకారణముగా రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పాలకమండలి చైర్మన్ గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వార్ల ఆదేశముల మేరకు  దేవస్థానం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు ప్రజలు అందరు ఆయురాగ్యములతో సుభిక్షముగా ఉండాలని సంకల్పించి ది:27-05 -2021 నుండి ప్రతిరోజు ఉదయం 08.30 గం. ల నుండి 09.గం. ల వరకు శ్రీ అమ్మవారి నామ మంత్రోచ్ఛరణలు వేదపండితులు మరియు అర్చక సిబ్బందిచే  జరుపబడుచున్నవి. ఈ కార్యక్రమం జరుగుచున్న సమయంలో భక్తులు(ఇంటి వద్ద నుండి మాత్రమే) google meet link ద్వారా పాల్గొని, వేదపండితుల వారితో గళము కలిపి, మానసిక ప్రశాంతత, సంపూర్ణ శరీర ఆరోగ్యత మరియు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కృప పొందుటకు గాను దేవస్థానం వారు అవకాశం కల్పించడమైనది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ లింక్ ద్వారా ఈ కార్యక్రమం నందు పాల్గొని, శ్రీ అమ్మవారి నామ మంత్రోచ్ఛరణ కార్యక్రమం నందు పాల్గొని, భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారి నామ స్మరణ చేయడం జరిగినది.