*వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం రీ సర్వేను చాలా సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో నిశితంగా క్వాలిటీ చెక్ చేయండి*
*రీ సర్వేలో చిన్న తప్పు కూడా దొర్లకుండా పకడ్బందీగా విజయవంతం చేయండి*
*వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం మరియు భూరికార్డుల స్వచ్చీకరణ అంశంపై నిర్వహించిన ఓరియంటేషన్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్డీఓ లు, సర్వే శాఖ అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్*
కర్నూలు, జూన్ 11 (ప్రజా అమరావతి):
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం రీ సర్వేను చాలా సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో జరిగే రీ సర్వేను నిశితంగా క్వాలిటీ చెక్ చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్ డిఓలకు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు.
శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా భూరికార్డుల స్వచ్చీకరణ అంశంపై ఆర్డీఓ లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే శాఖ, రెవిన్యూ శాఖ అధికారులకు ఓరియంటేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి ,డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓలు రామకృష్ణారెడ్డి, హరి ప్రసాద్, వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిపిఓ ప్రభాకర్ రావ్, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, సర్వే శాఖ ఏడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం రీ సర్వే ద్వారా రైతుల భూములకు శాశ్వత భూ హక్కు రికార్డు కల్పిస్తూ భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు..భూ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ సర్వే చేయించి, వైయస్సార్ జగనన్న భూ రక్షా హద్దు రాళ్లు నాటి తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పరిష్కారం జరుగుతుందన్నారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైతే సర్వే చేస్తున్నారో ఆ పట్టా భూమి లోని రైతులతో సమావేశం నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని మూడు డివిజన్లలో ఒక గ్రామంలో భూముల సమగ్ర రీ సర్వే గత సంవత్సరం నుంచి జరుగుతోంద్దన్నారు..ఈ సర్వేను పకడ్బందీగా చేపట్టడానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్ గా నిశితంగా పరిశీలిస్తూ క్వాలిటీని చెక్ చేస్తూ... రీ సర్వే చేసే వారిని గైడ్ చేస్తూ... చిన్న తప్పు కూడా దొర్లకుండా రీ సర్వే ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వెళ్ళినప్పుడు భూముల సమగ్ర సర్వే సరిగా జరుగుతుందో లేదో చెక్ చేస్తూ భూముల సమస్యలపై మీరు ఎదుర్కొన్న మీ అనుభవాలను వాటన్నిటిని నిశితంగా పరిశీలించి రీ సర్వే బాగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు పది గ్రీవెన్స్ వచ్చేవని, అందులో కచ్చితంగా భూసమస్యలకు సంబంధించినవి ఉండేవన్నారు
చాలా సంవత్సరాలుగా ఉన్నరైతుల భూ సమస్యలు పరిష్కారం కానివి, రీ సర్వేతో పరిష్కారం అవుతాయన్నారు. అత్యాధునిక continuous ఆపరేటింగ్ రిసీవింగ్ స్టేషన్ (కోర్స్) నెట్‌వర్క్ ద్వారా, డ్రోన్ లతో రీసర్వే జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించి బాగా జరిగేలా చూడాలన్నారు.
అదేవిధంగా ఓరియంటేషన్ లో జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం రీ సర్వే జిల్లాలోని మూడు డివిజన్లలో ఒక్కో గ్రామంలో, 54 మండలాల్లోని 54 గ్రామాలలో రీ సర్వే జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి రీ సర్వే ని పరిశీలించడానికి క్వాలిటీ చెక్ ఆఫీసర్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లను నియమించడం జరిగిందని, ఈ సర్వే జరుగుతున్న తీరును బాగా పరిశీలించి ల్యాండ్ ప్యూరిఫికేషన్ చేయాలన్నారు.ప్యూరిఫికేషన్ ల్యాండ్ రికార్డ్స్ లో భాగంగా ప్రొఫార్మా 1, 2, 3, 4, 5 లను సోమవారం నాటికి పూర్తి చేయాలని ఆర్డీఓలకు ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి విలేజ్ కు నాలుగు టీములును నియమించుకోవాలి అన్నారు. ఈ టీమ్ ల్లో కచ్చితంగా డి ఎల్ పి ఓ, ఎం పి డి ఓ,
గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు ఉండాలన్నారు. రైతులకు గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు తెలియజేయాలన్నారు. డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందించాలన్నారు. సర్వేకు మునుపు ప్రతి యజమానికి నోటీసు ద్వారా సమాచారం తెలియజేయాలన్నారు. పాత రికార్డులు మరియు కొత్త రికార్డ్ లో ఏమైనా తేడాలుంటే వెంటనే సరి చూసుకోవాలన్నారు. సచివాలయంలో సోషల్ ఆడిట్ లో భాగంగా భూముల సమగ్ర సర్వే జాబితాలను ప్రదర్శిస్తామని ఇంకా ఏమైనా భూములు సమస్యలు ఉంటే మొబైల్ కోర్టులో సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే విషయం తెలియజేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం మరియు భూరికార్డుల స్వచ్చీకరణ అంశంపై ఓరియంటేషన్ లో జాయింట్ కలెక్టర్ వివరించారు.
*DD
addComments
Post a Comment