కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు చర్యలు

 *'కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు చర్యలు* 

 


 *అనంత జీజీహెచ్ పరిశీలనలో జేసీ సిరి* 


అనంతపురము, జూన్ 16 (ప్రజా అమరావతి);కరోనా థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలు కోవిడ్ బారిన పడతారన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. 


బుధవారం ఉదయం అనంత సర్వజన ఆసుపత్రిని జేసీ సిరి తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడకలను, ఆక్సిజన్ ప్లాంటును జేసీ పరిశీలించారు.  


అనంతపురం, హిందూపురం కోవిడ్ ఆసుపత్రుల్లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక వార్ఢుల ఏర్పాటు, ఆక్సిజన్ బెడ్స్ పెంపు, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరు కోవిడ్ బారిన పడ్డా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో అనంత సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.