ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులు కొరత లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టండి

 

*పంటలు సాగు చేసే ప్రతీ రైతుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలను, ఎరువులను పంపిణీ చేయండి* 


*ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులు కొరత లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టండి*


*క్రాప్ ప్లానింగ్, ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత, ప్రతికూలత, ప్రత్యామ్నాయ పంటలు, తదితర అంశాలపై మరింత దృష్టి సారించండి*


*ఈ క్రాప్ బుకింగ్ 100% జరగాలి*


జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్


కర్నూలు, జూన్ 10 (ప్రజా అమరావతి);:


పంటలు సాగు చేసే ప్రతీ రైతుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో విత్తనాలను, ఎరువులను సకాలంలో పంపిణి చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు. 


గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఖరీఫ్, రబీ సీజన్ సన్నద్ధత, రాయితీపై విత్తన సరఫరా, ఎరువులు, వ్యవసాయ రుణాలు, వైఎస్సార్ పొలం బడి, వేరుశెనగ విత్తనాల పంపిణీ, తదితర అంశాల పై వ్యవసాయ శాఖ ఏవో, ఏడి, డి డి, జె డి, వ్యవసాయ సలహా మండలి తో  జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, ఏపిఎంఐపి పిడి ఉమాదేవి, మార్కెటింగ్ శాఖ ఏడి సత్యనారాయణ చౌదరి, ఎం డి ఎం వెంకట్ నారాయణ, డి సి సి బి సిఈ ఓ రామాంజనేయులు, వ్యవసాయ శాఖ ఏఓ, ఏడి, డిడి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో సమృద్ధిగా వర్షం కురిసింది అని, ఈ నెలలో కూడా వర్షాలు బాగా కురుస్తాయిని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని, రుతుపవనాలు సకాలంలో వచ్చి వర్షాలు బాగా కురుస్తున్నాయిని, శ్రీశైలం ప్రాజెక్టులో 12 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కలదని, చెరువులు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో ఈ ఏడాది భారీగానే పంటలను సాగు చేసే అవకాశాలున్నాయని ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి రైతులకు సరైన సమాచారం ఇచ్చి మంచి సలహాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్సిడీ విత్తనాలను, ఎరువులను పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువులు కొరత లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

క్రాప్ ప్లానింగ్, ప్రాంతాల వారీగా ఏఏ పంటలకు సానుకూలత, ప్రతికూలత, ప్రత్యామ్నాయ పంటలు, తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు మరింత దృష్టి సారించాలని సూచించారు.  ఇంత వరకు రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ సలహా మండల కమిటీ సమావేశం నిర్వహించి లేదని, వెంటనే రైతు భరోసా కేంద్రాల వారీగా వ్యవసాయ సలహా మండళ్ల కమిటీల సమావేశాలు వెంటనే నిర్వహించి, వారి సూచనలు చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులు పురోగతి సాధించేలా, త్వరితగతిన పూర్తయ్యేలా పంచాయతీరాజ్ ఏఈలతో కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తూ పర్యవేక్షించి మన ఇంటి పనిలా చూస్తూ క్వాలిటీ ఉండేలా వెంటపడి నిర్మాణ పనులను పూర్తి చేయించాలని వ్యవసాయ శాఖ ఏఓ, ఎడిలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సచివాలయం భవన నిర్మాణాలు చాలా బాగా జరిగాయిని ఎంపీడీఓలు దగ్గరుండి చేయించుకుని భవన నిర్మాణ పనులు పూర్తి చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలు భవన నిర్మాణ పనుల ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉందని, ఇంకా ఆర్ బి కె భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ పూర్తి చేయాలన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మల్టీ పర్పస్ సెంటర్ల స్థల సేకరణ జరిగేలా తహసిల్దార్ లతో మాట్లాడుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు జిల్లాకు ఎంత అవసరమో ప్రణాళికలు సిద్ధం చేసుకొని జిల్లాకు వచ్చిన వెంటనే రైతులకు తెలియజేసి విత్తనాలు, ఎరువులు పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు విరివిగా ఇచ్చేలా చూడాలని ఎల్ డి ఎం వెంకట్ నారాయణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ నేపథ్యంలో బ్యాంకర్లతో మాట్లాడుకొని ప్రతి గ్రామానికి వెళ్లి ఒకరోజు కేటాయించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతు భరోసా పెట్టుబడి సహాయం, తదితర వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ రుణాలు అన్ని రైతుల దగ్గరికి వెళ్లి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఎల్ డి ఎం వెంకట్ నారాయణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రైతు పండించిన పంటను ఈ క్రాప్ బుకింగ్ 100% జరిగేలా ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 


జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 35,000 మందికి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకోవాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలపై అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకు సకాలంలో విత్తనాల పంపిణీ జరగాలన్నారు. బోర్ల కింద పండించే వరి పంటలకి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ 100% జరిగేలా చూడాలని, ప్రత్యేకంగా డివిజన్ కు స్పెషలాఫీసర్ నియమించామని, వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి గ్రామానికి వచ్చి క్రాస్ చెక్ చేస్తారని అనే విషయంపై విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు తెలియజేయాలని ఏఓలకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పంట మార్పిడి పద్ధతి కూడా ఖచ్చితంగా పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జూలై 8న వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా రైతు దినోత్సవం పురస్కరించుకొని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను పండగ వాతావరణంలో  ప్రారంభించే కార్యక్రమం చేపట్టాలన్నారు. పొలంబడి రైతులకు అవగాహన కార్యక్రమం రెగ్యులర్గా జరగాలన్నారు. 


అదేవిధంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందుబాటులో విత్తనాలను స్టాక్ పాయింట్ లో నెల ఉంచేలా చర్యలు చేపట్టాలని జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులుకు కోరారు. ఇన్సూరెన్స్ విషయంలో చెరుకు పంటకు మాత్రమే ఇస్తున్నారని బ్లాక్ గ్రామ్ కూడా ఇచ్చేలా ఉన్నత అధికారులకు తెలియజేయాలని వారు కోరారు. తాను కొన్ని ప్రాంతాల్లో పర్యటించానని రెడ్ గ్రామ్ కు కొన్ని ఏరియాల్లో ఇన్సూరెన్స్ వచ్చిందని కొన్ని ఏరియాల్లో రావడంలేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image