వైద్యరంగానికి సంబంధించిన పరిశ్రమల యూనిట్ల స్థాపనకు ముందుకు రండి



*వైద్యరంగానికి సంబంధించిన పరిశ్రమల యూనిట్ల స్థాపనకు ముందుకు రండి


  :-*

 *పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పిలుపు*


*వైయస్సార్ జగనన్న బడుగు వికాసంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి :-*


*జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :-* 


కర్నూలు, జూన్ 17 (ప్రజా అమరావతి);


వైద్య రంగానికి సంబంధించిన పరిశ్రమల యూనిట్ల స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోన్దని,  ఔత్సాహిక వేతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పిలుపునిచ్చారు.


గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జి ఎం డి ఐ సి, ఇండస్ట్రియల్ అసోసియేషన్, సంబంధిత అధికారులతో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ 16 మెడికల్ కళాశాలను మంజూరు చేశారని, అందులో కేవలం కర్నూలు జిల్లాకే కర్నూలు జిల్లాలో ప్రధానంగా నంద్యాల, ఆదోనిలో మెడికల్ కళాశాలను మంజూరు చేశారన్నారు. కర్నూలు జిల్లాలో నంద్యాల ఆదోని మెడికల్ కాలేజ్ తో పాటు కర్నూలు మెడికల్ కాలేజీతో కలుపుకుంటే మూడు టీచింగ్ హాస్పిటల్ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో  హాస్పిటల్ కు సంబంధించిన అనుబంధ పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాల్సిందిగా కలెక్టర్ పారిశ్రామిక వేత్తలను కోరారు.  వైయస్సార్ జగనన్న బడుగు వికాసం పథకంపై లబ్దిదారులు, బ్యాంకర్లతో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.. ఈ పథకం తో పాటు అన్ని పథకాల గురించి అవగాహన కల్పించి, తద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు.  అనుమతుల కు సంబంధించి సింగల్ డెస్క్  పోర్టల్ లో  260 దరఖాస్తులు రాగా, అందులో 243 దరఖాస్తులు నిర్దేశించిన గడువు లోగా ఆమోదించడం జరిగిందని, మరో 9 అప్లికేషన్లు పురోగతిలో వున్నాయని, మరో  8 అప్లికేషన్లు  తిరస్కరించడం జరిగిందన్నారు..  ఏ కారణంతో వాటిని తిరస్కరించడం జరిగిందో ఆ వివరాలను  దరఖాస్తుదారుల కు తెలియజేయాలని జిఎం డి ఐ సినీ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సులభతర వాణిజ్య విధానంలో భాగంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు  ఫైర్, పొల్యూషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్,  తదితర శాఖల పరిధిలో ఇవ్వాల్సిన అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలోపు   త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సేవా రంగం లో ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ట్రేడ్ లైసెన్స్ లు పంచాయతీ కార్యదర్శుల సంప్రదించినప్పుడు త్వరితగతిన ట్రేడ్ లైసెన్సులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి కి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైయస్సార్ జగనన్న బడుగు వికాసంపై కళాశాలలు, విశ్వవిద్యాలయం, నైపుణ్య అభివృద్ధి సంస్థలు, బ్యాంకర్లు, లబ్ధిదారులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, పవర్ టారిఫ్, ఇంట్రెస్ట్ సబ్సిడీ, జి ఎస్ టి  మొత్తం 167 క్లెయిమ్స్ కు రూ.6,03,32,982 సబ్సిడీ మొత్తం మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు.


జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు, జి యం డి ఐ సి సోమశేఖర్ రెడ్డి, నాబార్డు డిడి ఎం పార్థసారథి, ఎల్ డి ఎం వెంకట్ నారాయణ, Zm Apiic వెంకట నారాయణమ్మ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, డి ఐ సి చందర్, Kuda Vc, డి సి ఎస్ టీ సత్య ప్రకాష్, డిక్కీ ప్రెసిడెంట్ రాజమహేంద్ర నాథ్, ప్రెసిడెంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ విజయ్ కుమార్ రెడ్డి, ఇండస్ట్రియల్ అసోసియేషన్ జయన్న, తదితర సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments