జిజిహెచ్ (ప్రజా అమరావతి);
మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు జిజిహెచ్ సన్నద్ధం
వెంటిలేటర్ పడకల ఏర్పాట్లు
అందుబాటులో మందులు
కోవిడ్ రెండో వేవ్ ఉద్రితి ఇంకా తగ్గలేదు. అప్పుడే మూడో వేవ్ గురించి గుంటూరు సర్వ జన ఆసుపత్రి ఆ ముప్పును ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశాలపై సన్నద్ధమవుతోంది.
మూడో వేవ్ చిన్నారులపై తీవ్ర పరిణామాలు జరిగే
అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ పి ప్రశాంతి జిజిహెచ్ వైద్య విభాగాధిపతులతో రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించారు.
ముందస్తు సన్నాహాలపై ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ ప్రభావతి తెలిపారు.
మొదటి..రెండో వేవ్ లు చిన్నారులపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఈ మూడో వేవ్ మాత్రం చిన్నారులపై కనిపిస్తుంది.
ఇప్పటి నుంచే అప్రమత్తమవ్వాలని భావిస్తున్నాం. ఈ ఆసుపత్రిలో 20 మంది.చిన్నారులు కోవిడ్ లక్షణాల తో చికిత్స పొందుతున్నారు.
ఈ మూడో వేవ్ లో చిన్న పిల్లలతో పాటు పది నుంచి 15 సంవత్సరం వయస్సు ఉన్నవారికి తీవ్ర జ్వరం, కిడ్నీ లు దెబ్బతినడం లక్షణాలు తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఉంది.
ఒక్కసారిగా చిన్నారులు వైరస్ బారిన పడి జిజిహెచ్ కు వస్తే ఎలాంటి చికిత్స అందించాలన్న విషయాలపై కూడా సమీక్ష చేస్తున్నాం.
చిన్నారులలో ప్రతి అవయవం పై ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రులు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకుని రావాలి.
ప్రస్తుతం 120 పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఐ సి యు 20 బెడ్స్ ను సిద్ధంగా ఉంచాం. పసి పిల్లల కోసం వెంటిలేటర్స్ ను సిద్ధం చేసాం.
ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్నారులకు అవసరమయ్యే మందుల కొరత లేకుండా చూస్తాం.
అవసరమైతే మందులను కొనుగోలు చేయడానికి వెనుకాడాం.
వైరస్ సోకకుండా ఉండేందుకు పిల్లల ఆరోగ్య విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 24 గంటల పాటు మాస్క్ ధరించే విధంగా చూడాలి. మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలి.
బాలలకు మెరుగైన వైద్యం అందించడానికి జిజిహెచ్ ఇప్పటి నుంచే సన్నద్ధమైందని ఆమె వివరించారు.
addComments
Post a Comment