విజయవాడ (ప్రజా అమరావతి);
ఎస్.ఐ.సి. లక్ష్మణాచార్యులుకు డివిజినల్ పిఆర్ ఓగా పదోన్నతి
.
ఘనంగా వీడ్కోలు పలికి అభినందించిన అధికారులు, సిబ్బంది...
సమాచార శాఖలో ఏపిఆర్ ఓగా సుదీర్ఘకాలం సేవలు అందిస్తూ అధికారులు, మీడియా
ప్రతినిధుల మన్ననలను అందుకొని డివిజినల్ పౌరసంబందాధికారిగా పదోన్నతి పొంది బదిలీ పై
వెళుతున్న ఏపిఆర్ ఓ యం. లక్ష్మణాచార్యుల అంకితభావం పనితీరును ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా
తీసుకోవాలని
జిల్లా పౌర సంబంధాధికారి యం. భాస్కరనారాయణ అన్నారు.
విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం (యస్ఇసి) లో సహాయ పౌర సంబందాధికారిగా
పనిచేస్తున్న ముడుంబై లక్ష్మణాచార్యులకు కొవ్వూరు డివిజినల్ పౌర సంబందాధికారిగా పదోన్నతి
కల్పిస్తూ ఇటీవల సమాచార శాఖ కమిషనరు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పదోన్నతి పొందిన
ఆయనకు సమాచార శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం యస్ఈ సిలో అభినందన సభను
నిర్వహించారు. సభలో డిపిఆర్ఓ యం. భాస్కర నారాయణ మాట్లాడుతూ ఇటీవల సంవత్సర కాలం
నుండి ఏర్పడిన కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారుల
నుండి సేకరించి మీడియా ప్రతినిధులకు అందజేయడంలోనూ, జిల్లా కలెక్టరు నిర్వహించిన
సమావేశాలతో పాటు ప్రజాప్రతినిధులు రాష్ట్రస్థాయి అధికారుల పర్యటనలకు సంబంధించిన
సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ప్రతినిధులకు అందజేయడం వాటిని కవరేజ్ చేసి
మీడియాకు పంపిణి చేయడంలో లక్ష్మణాచార్యులు కీలకపాత్ర వహించి మన్ననలను అందుకున్నారు.
ఆయన నిర్వహించిన ఉద్యోగ బాధ్యతలు పనితీరును ఆదర్శంగా తీసుకుని సమాచార శాఖ మరింత
పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి సిబ్బంది కృషి చేయాలన్నారు. పదోన్నతి పొందిన
లక్ష్మణాచార్యులు మరింత మన్ననలను పొంది ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ
శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. డిప్యూటి డైరెక్టరు మహబూబ్ భాషా, రి సెప్షనిస్ట్ జె.వి. లక్ష్మి
వర్చువల్ విధానం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ తన విధి నిర్వాహణను విజయవంతంగా నిర్వహించడంలో
సహకరించిన ఉన్నతాధికారులు సిబ్బంది జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలను
తెలియజేస్తున్నానన్నారు.
కార్యక్రమంలో భాగంగా డివిజినల్ పౌర సంబందాధికారి ఆర్ వియస్. రామచంద్రరావు,
సిబ్బంది వి.వి.ప్రసాద్, సిహెచ్. జాక్సన్ బాబు, సురేష్ కుమార్, యశోద, భవాని, బి.రాంబాబు,
నాగరత్నం, అబ్దుల్ వహీద్, రవితేజ, తదితరులు లక్ష్మణాచార్యుల సేవలను కొనియాడారు.
addComments
Post a Comment