ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి మేకపాటి అసహనం.

 



శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి మేకపాటి అసహనం.



ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని డీఈ, ఏఈలను ప్రశ్నించిన మంత్రి గౌతమ్ రెడ్డి


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీర్లతో ఆత్మకూరు నియోజకవర్గంపై మంత్రి సమీక్ష


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గౌతమ్ రెడ్డి


ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందుల కన్నా అధికారుల నిర్లక్ష్యం ఎక్కువుందన్న మంత్రి మేకపాటి


విజయవాడ ప్రధాన కార్యాలయం ఈఎన్ సీ సుబ్బారెడ్డికి ఫోన్ లో పనుల పురోగతి పరిస్థితిని వివరించిన మంత్రి మేకపాటి


రూ.120 కోట్ల విలువైన ఇంజనీరింగ్ పనులలో మందగమనంపై మంత్రి మేకపాటి ఆగ్రహం


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో స్వయంగా మాట్లాడి ఆత్మకూరు ప్రజలకు మంచి చేయాలని ప్రత్యేకంగా మంజూరు చేయించుకున్న రూ.20 కోట్ల పనులపైనా మంత్రి ప్రస్తావన


గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ చికిత్స కేంద్రాలు,  బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల అభివృద్ధిలో పురోగతి లేకపోవడంపై మంత్రి అసంతృప్తి


పనులను అలక్ష్యం చేసినవారి స్థానంలో పని పూర్తి చేసేవారిని తీసుకువచ్చేందుకు సంశయించనని మంత్రి వెల్లడి


ఆత్మకూరులో పనులపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దృష్టికి తీసుకువెళతానన్న మంత్రి మేకపాటి


ఆత్మకూరులోని అనంతసాగరం, ఆత్మకూరు, మర్రిపాడు, చేజెర్ల, ఏ.ఎస్ పేట మండలాల్లో ఇంకా పనులే మొదలు కాని పనులు, పునాది రాయి కూడా పడని పనులు, ఇంకా నిర్మాణదశలోనే పనులను ఉంచడం బాధాకరం


కేటాయించిన లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన అధిగమించాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశం


నిజంగా స్టీల్, సిమెంట్ వంటి కొరత వస్తే డీలర్లతో, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కారిస్తామని వెల్లడి


---------------------

Comments