నెల్లూరు జి.జి.హెచ్. ఆస్పత్రిలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించి.., వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి శంకుస్థాపన చేశారు.



నెల్లూరు (ప్రజా అమరావతి);


నెల్లూరు జి.జి.హెచ్. ఆస్పత్రిలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించి.., వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి శంకుస్థాపన చేశారు.  



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పి.హెచ్.సి లు, సి.హెచ్.సి లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా.., ప్రస్తుతం వైద్య సదుపాయాలు, వసతి సదుపాయాలను కల్పించామన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్స్ ని ప్రతిగ్రామంలోనూ, వార్డులలోనూ నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. 1st, 2nd కోవిడ్ వేవ్ లలో జిల్లా మంత్రులు, శాసన సభ్యుల సహకారంతో.., కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించమన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ సదుపాయం కల్పించామని, ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించామన్నారు. ఓ దశలో 24 గంటల్లో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని కోవిడ్ రోగుల కోసం వినియోగించామని, ఆ పరిస్థితిని అధిగమించి ప్రస్తుతం రాష్ట్రంలో అతి తక్కువ పాజిటివిటీ రేటును జిల్లాలో నమోడవుతుంది అని  కలెక్టర్ తెలిపారు. 3వ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను పెంచుతున్నామన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో నిర్వహిస్తున్నామని.., ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కోవిడ్ కేసులు తగ్గాయని నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ., బాధ్యతగత పౌరులుగా మెలగాలన్నారు. 


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్, డి.ఎం& హెచ్.ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Comments