రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం



*రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం


*

*ముఖ్యమంత్రి శ్రీయస్‌.జగన్‌ చేతుల మీదుగా రేపు(18-06-2021) 2021–22 జాబ్‌ క్యాలెండర్‌ విడుదల*

*మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ నెరవేరుస్తూ దశలవారీగా ఉద్యోగుల భర్తీ* 

*రాష్ట్రంలో ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం*

*ఆ దిశలో మరో ముందడుగు, ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ ప్రకటన*

*విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం*

*అత్యంత పారదర్శకంగా ఉద్యోగనియామకాలు*

*అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ* 


*ఇప్పటివరకు రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756  మందిని నియమించిన ప్రభుత్వం* 


*భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు 10,143*


అమరావతి (ప్రజా అమరావతి);


మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది.  నిరుద్యోగ యవకుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికోసం ఉద్యోగాల క్యాలెండర్‌ను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రేపు (18–06–2021)  విడుదల చేయనున్నారు.

ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డియస్సీ తదితర నియామక సంస్ధల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేయనుంది.   

 

 రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019, జూన్‌ నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలు చూస్తే.. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని నియమించారు. 


*ఉద్యోగాలు–వివరాలు:*


గ్రామ, వార్డుల వలంటీర్లు(గౌరవ వేతనం): 2,59,565

గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లు: 1,21,518

వైద్య,ఆరోగ్య కుటుంబసంక్షేమం             13,987

ఆర్‌అండ్‌బి,ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య: 58,388

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు (ఆప్కాస్‌):     95,212

ఏపీపీఎస్సీ :                      2,497

పశుసంవర్ధక, మత్స్యశాఖలు                  372

వ్యవసాయ,సహకారశాఖలు       175

ఆహార,పౌరసరఫరాలశాఖ                       237

పాఠశాల విద్య         :              4,758

ఉన్నత విద్య       1,054

గిరిజన సంక్షేమం :       1,175

సాంఘిక సంక్షేమం :                          669

మహిళా,శిశు అభివృద్ధి, వయోజనశాఖ     3500

నైపుణ్యాభివృద్ధి                                     1,283

విద్యుత్‌శాఖ      8,333

జలవనరులశాఖ :     177

ఇతర శాఖలు :                             4,531

–––––––––––––––––––

మొత్తం ఉద్యోగుల సంఖ్య: 5,77,431

–––––––––––––––––––


కోవిడ్‌–19 సమయంలో వైద్య సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన మరో 26,325 ఉద్యోగులను నియమించడం జరిగింది.

ఈ నేపథ్యంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని ప్రభుత్వం నియమించింది.


వీరిలో గ్రామ, వార్డు వలంటీర్లు 2019, ఆగస్టులో నియమితులు కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లను 2019, అక్టోబరులో నియమించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసి)ను 2020, జనవరి 1న ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తూ ఏర్పాటు చేసిందే ‘ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌’ – ఆప్కాస్‌.


*ఇక వచ్చే నెల అంటే 2021, జూలై నుంచి జరపనున్న ఉద్యోగ నిమామక వివరాలు:*


ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఎంత మంది


జూలై–2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238

ఆగస్టు–2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2.   36

సెప్టెంబరు–2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు   450

అక్టోబరు–2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు   451

నవంబరు–2021 పారామెడికల్‌ సిబ్బంది        5,251

డిసెంబరు–2021 నర్సులు    441

జనవరి–2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు    240

ఫిబ్రవరి–2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు    2,000

మార్చి–2022 ఇతర శాఖలు                     36

––––––––––––––––––––

భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు: 10,143

––––––––––––––––––––


ఆ విధంగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి మొత్తం 10,143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.