బాబు పరిపాలనలో కూల్చి వేయండి అంటూ ఆదేశాలు.

 బాబు  పరిపాలనలో కూల్చి వేయండి అంటూ ఆదేశాలు. 


 


 *సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రత్యామ్నాయం చూపించారు*  


*ఎమ్మెల్యే ఆర్కె చొరవతో పేదలకు న్యాయం*   


*మరో పది రోజుల్లో నివాస స్థలాలు కేటాయింపు*    

 

 ఎమ్టిఎంసి (ప్రజా అమరావతి);   


*తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట ప్రాంతంలో ఇరిగేషన్ భూములు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న పేద ప్రజల నివాసాలను తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో తొలగించాలని* *నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ఆర్కె చొరవతో కోర్టును ఆశ్రయించి అప్పట్లో ఇల్లు తొలగించకుండా అడ్డుపడ్డారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే* *ముఖ్యమంత్రి వైయస్  జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వెంబడి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో అధికారులు సీఎం భద్రత చర్యల్లో భాగంగా నివాసాలు తొలగించాలని స్థానిక అధికారులు ఆదేశించారు* *వెంటనే ఎమ్మెల్యే ఆర్కె ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకు వెళ్ళడంతో ప్రత్యామ్నాయం చూపించకుండా ఇటుక కూడా తియ్యవద్దు అంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు దీంతో అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చూసి అర్హులైన ప్రతి పేదవాడికి రెండు సెంట్లు*

 *స్థలం కేటాయించేందుకు ఆత్మకూర్ వద్ద 12 ఎకరాలు కొనుగోలు చేసి ఫ్లాట్ లను కేటాయించారు మరో పది రోజుల్లో వారందరికీ ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని ఎమ్మెల్యే ఆర్కె స్పష్టం చేశారు గురువారం లెవలింగ్ పనులు పూర్తి అయ్యాయి మరో రెండు రోజుల్లో మార్కింగ్ చేసి ఫ్లాట్ నెంబర్లు కేటాయించి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తాడేపల్లి ఎంపీడీవో రాం ప్రసన్న పనులు పరిశీలిస్తున్నారని మరో ఐదు రోజుల్లో పనులు పూర్తవుతాయని అనంతరం లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ఆయన అన్నారు ఈ పన్ను సకాలంలో పూర్తి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి పట్టణ కన్వీనర్ బుర్ర ముక్కు వేణుగోపాల సోమిరెడ్డి మంగళగిరి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి యువజన నాయకులు వివేకానంద రెడ్డి లక్ష తులసి దాస్ తదితరులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు...

Comments