శ్రీ అమ్మవారి దర్శన సమయం పెంపు:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో ది.11-06-2021 నుండి మధ్యాహ్నం 02 గం. ల వరకు కోవిడ్ -19 కర్ఫ్యూ సడలింపు దృష్ట్యా దేవస్థానం నందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శన సమయము పొడిగించడమైనది.
ప్రస్తుతం ఉదయం 06.30 గం.ల నుండి 11.30 గం.ల వరకు శ్రీ అమ్మవారి దర్శనం కల్పిస్తుండగా, రేపు అనగా ది.11- 06- 2021 నుండి మధ్యాహ్నం 01.30 గం. ల వరకు covid -19 నియమములు అనుసరిస్తూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం కల్పించబడును. మరియు ఉదయం 11.45 గం.ల నుండి 12.15 గం. ల వరకు శ్రీ అమ్మవారి మహా నైవేద్యం కొరకు దర్శనం నిలుపుదల చేయబడును అని గౌరవనీయులైన ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు తెలిపారు.
దేవస్థానము నందు శ్రీ అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ పరోక్ష సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నది.
దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు నిత్య ఆర్జిత సేవలయందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులుచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవి. భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు ఖడ్గమాలార్చన, రుద్ర హోమము, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణము, మృత్యుంజయ హోమము, గణపతి హోమం, శ్రీచక్రనవావర్ణార్చన సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామములతో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది. కావున ఈ సేవలు పరోక్షముగా జరిపించుకోనదలచిన భక్తులు టిక్కెట్లు online నందు www.tms.ap.gov.in లేదా www.kanakadurgamma.org website లేదా https://www.onlinesbi.com/sbicollect/icollecthome.htm ద్వారా పొందవచ్చును.
శ్రీ అమ్మవారి సేవలో...
కార్యనిర్వహణాధికారి.
addComments
Post a Comment