శ్రీ విజయసాయిరెడ్డి చాణక్యానికి అద్దం పట్టిన జగన్మోహనుడి ఢిల్లీ యాత్ర
శ్రీకృష్ణుడికి అర్జునుడు తోడైతే మహాభారతంలో మహాద్భుతాలు సంభవించాయి. శత్రుసంహారం, లోకకల్యాణం జరిగాయి. అగ్నికి వాయువు తోడైతే వారి విజృంభణను ఆపడం ఎవరి తరం అవుతుంది?
వైఎస్సార్సీపీ అగ్రనేత, పార్టీకి సలహాదారు, వ్యూహకర్త, అన్నింటిని మించి గోల్డ్ మెడలిస్ట్ అయిన ఛార్టర్డ్ అకౌంటంట్, మేధావిగా గుర్తింపు పొందిన నా గురుతుల్యులు శ్రీ వేణుంబాకం విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు ఎంపికైన మరుక్షణం నుంచే ఢిల్లీలో గౌరవనీయులు, మాన్య ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ తరపున కార్యకలాపాలు నిర్వహించడం, ఎంపీలను సమన్వయము చెయ్యడం, రాష్ట్రం తరపున వివిధ మంత్రులను కలిసి రాష్ట్రానికి కావలసిన నిధులు, విభజన చట్టం అమలు గూర్చి పోరాటాలు, ఉద్యమాలు చేసి వైఎస్సార్సీపీ అంటే కేంద్రప్రభుత్వం, జాతీయ పక్షాల దృష్టిలో ఒక గుర్తింపు తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీలో పార్టీ తరపున చేసిన పోరాటాలకు నాయకత్వం వహించి పార్టీ ఇమేజ్ ను పెంచిన ఘనత శ్రీ విజయసాయిరెడ్డి గారిదే.
మొన్న ముఖ్యమంత్రి జగన్మోహనుడి రెండు రోజుల ఢిల్లీ పర్యటన దిగ్విజయంగా ముగిసిందంటే దాని వెనుక విజయసాయిరెడ్డి గారి కృషి, శ్రమ అనితరసాధ్యం. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభుత్వంలో కీలక మంత్రిగా పేరొందిన శ్రీ అమిత్ షా గారితో సుమారు గంటా నలభై నిముషాల సమావేశం, అలాగే ప్రముఖ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు శ్రీయుతులు ధర్మేంద్ర ప్రధాన్, షెకావత్, పీయూష్ గోయల్, జవదేకర్ లతో ఒక్కొక్కరితో సుమారు గంట చొప్పున సమావేశాలు జరగడం వెనుక అక్కడి అపాయింట్మెంట్స్, మంత్రుల పేషీలతో సమన్వయము చేసుకుని వారి అనుమతులు సాధించడం, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి బృందాన్ని విమానాశ్రయంలో స్వాగతించడం, మంత్రులతో సమావేశాలను ఎప్పటికప్పుడు మానిటర్ చెయ్యడంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర అత్యంత ప్రశంసాపాత్రమైనది.
శ్రీ విజయసాయి రెడ్డి గారు మా పార్టీకి ఒక వజ్రసమానుడుగా పార్టీ మొత్తం భావిస్తున్నది. శ్రీ విజయసాయిరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ రామ భాస్కర్ దేవరకొండ.
addComments
Post a Comment