అమరావతి (ప్రజా అమరావతి);
గుణదల ESI డిస్పెన్సరీని తనిఖీ చేసిన కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు..
ఈ రోజు అనగా 17.06.2021 న ఉదయం 11:30 గo. లకు గుణదల ESI డిస్పెన్సరీకి వెళ్లి, అక్కడ చికిత్స కొరకు వచ్చిన కార్మికులతో మంత్రి గారు స్వయంగా మాట్లాడి, ధన్వానంతరి APP ను కార్మికులు ఏ విధంగా ఉపయోగించుకుంటారో తెలుసుకున్నారు.
ఈ ఆన్లైన్ ధన్వానంతరి APP ద్వారా కార్మికులు లైన్లలో నిలబడి వేచిఉండకుండ , ఆన్లైన్ ద్వారా డాక్టర్ల అప్పాయింట్ మెంట్లు (Appointments), ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా వినియోగించుకుంటున్నారు అని మంత్రి గారు తెలిపారు.
29.03.2021 న మంత్రి గారు ఈ ధన్వానంతరి APP ని ప్రారంభించారు. దేశంలో న్యూఢిల్లీ తరువాత మన రాష్ట్రంలో మాత్రమే ఈ ధన్వానంతరి APP ద్వారా ఆన్లైన్లో వైద్యసేవలు కార్మికులు అందిస్తున్నామని మంత్రి గారు తెలిపారు.
గత 02 నెలలలో, 480 మంది కార్మికులు ఈ ఆన్లైన్ ధన్వానంతరి APP ద్వారా వైద్య సేవలు ఉపయోగించుకున్నారు.
గుణదల డిస్పెన్సరీలో వినియోగిస్తున్న, ఈ ఆన్లైన్ ధన్వానంతరి APP ద్వారా ఆన్లైన్లో కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న విధానానికి మంత్రి గారు సంతృప్తి చెంది, త్వరలోనే రాష్ట్రంలో ఉన్న మిగతా 76 డిస్పెన్సరీలలో కూడా ఈ ఆన్లైన్ ధన్వానంతరి APP వినియోగాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని IMS డైరెక్టర్ గారికి మరియు ఇతర అధికారులకు మంత్రి గారు ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్పెన్సరీలలో E.C.G, మరియు రక్త పరీక్షలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలి అని IMS డైరెక్టర్ గారికి మంత్రి గారు ఆదేశించారు.
addComments
Post a Comment