KGH లోకరోనాతో వెంటిలేటర్ పై గర్భిణీకి ఆపరేషన్ సక్సెస్ చేసిన డాక్టర్ కవిత టీమ్...

 అమరావతి (ప్రజా అమరావతి);



కెజిహెచ్ హాస్పిటల్ డాక్టర్ కవిత డాక్టర్స్ టీమ్ కుఅభినందనలు తెలిపిన రాష్ట్రఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


KGH లోకరోనాతో వెంటిలేటర్ పై గర్భిణీకి ఆపరేషన్  సక్సెస్ చేసిన డాక్టర్ కవిత టీమ్...



విశాఖపట్నం KGH హాస్పిటల్ లో కరోనాతో వెంటిలేటర్ పై గర్భిణీకి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాడిన KGH వైద్యులు వైద్య రంగంలో ఒక సరికొత్త రికార్డు సృష్టించారాని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...



కరోనాతో వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి దైర్యంగా ఆపరేషన్ చేసి వైద్య రంగానికి వన్నె తెచ్చిన KGH వైద్య బృందంతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని...



KGH వైద్యలు అరుదైన శస్త్ర చికిత్స చేసి KGH చరిత్రలో తొలిసారిగా తల్లి జయలక్ష్మి ని బిడ్డను కాపాడిన గైనకాలజిస్తు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత డాక్టర్స్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన మంత్రి ఆళ్ల నాని...



విశాఖపట్నం డాబా గార్డెన్స్ చెo దిన నిండు గర్భిణీ జయలక్ష్మి...



ఈ నెల 2న కరోనాతో KGH హాస్పిటల్ లో చికిత్స కోసం జాయిన్ అయినజయలక్ష్మి...



లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్న KGH వైద్య బృందం...



కరోనాతో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న జయలక్ష్మి బ్రతకడం కష్టం అని భావించిన కనీసం బిడ్డను కాపాడాలని డాక్టర్ కవిత బృందం చేసిన ప్రయత్నం పలించింది...


తల్లిని, బిడ్డను కాపాడి దైర్యంగా ఆపరేషన్ చేసినడాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ పద్మలీల,అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కవిత, డాక్టర్ నీరజ, డాక్టర్ అమృత, డాక్టర్ త్రిపాఠి, డాక్టర్ అనిలాకుమారి, డాక్టర్ భారతి,

టెక్ని షియన్ సంతోష, స్టాప్ నర్స్ నవనీత ను ప్రత్యేకంగా అభినంందిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...


యావత్ వైద్య రంగానికి మంచి గుర్తింపు తెచ్చిన డాక్టర్స్ సేవలు అభినందనీయం...


రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్స్ కు వైద్య సిబ్బందికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడి...


పెషేంట్ రిస్క్ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనిషి ప్రాణం కాపాడి కడుపులో ఉన్న బిడ్డనైనా కాపాడాలని వైద్యులు చేసిన ప్రయత్నం KGH హాస్పిటల్ కి ఒక రికార్డు సృష్టించారు డాక్టర్ కవిత డాక్టర్స్ టీమ్...



ప్రస్తుతం వెంటిలేటర్ మీద తల్లి జయలక్ష్మి చికిత్స పొందుతూ క్షేమంగా ఉన్నారు...


శిశువుకు కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చింది... ఈ శిశువు ప్రస్తుతం జయలక్ష్మి కుటుంబం సంరక్షణలో ఉంది...



కరోనాతో KGH హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న జయలక్ష్మి ని కాపాడడానికి సూపరింటెండెంట్ డాక్టర్ మైదిలి, డాక్టర్ కవిత బృందం మెరుగైన వైద్యంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు...



త్వరగా జయలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యం కోలుకోవాలని కోరుకున్న KGH వైద్య బృందం...



Comments