శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో 108 మంది బీద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

నరసావుపేట (ప్రజా అమరావతి);   శ్రీ  వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో 108 మంది బీద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ


కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .

ఈ కార్యక్రమంలో భాగస్తులైన ప్రతి ఒక్క సంఘ సభ్యునకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే .

కరోనా సమయంలో ఎన్నో మరియు నా జన్మదిన సందర్భంగా కూడా ఎన్నో కుటుంబాలకు గోపిరెడ్డి చారిటీస్ ద్వారా కూడా సహాయ సహకారాలు అందించాం.

100 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందిస్తాం.ఇళ్ళు కూడా కట్టిస్తాం.ఆరామ క్షేత్రాన్ని గల స్థలాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించాను. తప్పకుండా ఆరామ క్షేత్ర నిర్మాణానికి మరియు అక్కడకు చేరుటకు మార్గాన్ని మరియు మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.

బ్రాహ్మణులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుటకు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేడు చైర్మన్ గా సుధాకర్ గారిని కూడా నియమించడం జరిగింది.కోటప్పకొండ అభివృద్ధి కి కంకణం కట్టుకున్నాను. తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాను.బొచ్చుకోటయ్య వద్దకు మెట్ల మార్గం, రోడ్ల విస్తరణ, మొక్కలు నాటడం, గిరిప్రదక్షిణ రోడ్డు విస్తరణ , భారీ విగ్రహాల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రారంభిస్తాం.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటుగా వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ గారు, సంఘ అధ్యక్షుడు రంగవర్జుల సుబ్రమణ్య శాస్త్రి గారు, సంఘ కార్యదర్శి సాగి శివకృష్ణ శర్మ గారు, కోశాధికారి కేతమక్కల చంద్రశేఖర శర్మ గారు, అనుముల శ్రీనివాసరావు గారు, దుర్గ స్టూడియో బాబు గారు, రొంపిచెర్ల ఆంజనేయులు గారు, వైస్సార్సీపీ నాయకులు నిడమానురి సురేంద్ర గారు, కొత్తూరు కిశోర్ గారు, బ్రాహ్మణులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు.

Comments