రైతులంటే తెలియని రాబందు చంద్రబాబు చెప్పినట్లుగానే రైతులకు అకౌంట్లకు రూ.1,600 కోట్లు జమ



- రైతులంటే తెలియని రాబందు చంద్రబాబు చెప్పినట్లుగానే రైతులకు అకౌంట్లకు రూ.1,600 కోట్లు జమ 


- రూ.3,200 కోట్ల బకాయిలను కూడా రైతులకు చెల్లించాం 

- చంద్రబాబు, దేవినేని ఉమాలను రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు 

- టీడీపీని బీజేపీలో విలీనం చేసే పనిలో చంద్రబాబు 

- ఉమా లాంటి జోకర్లను నమ్మి రోడ్లపైకి వస్తే ఇబ్బందులే 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



తాడేపల్లి, జూలై 28 (ప్రజా అమరావతి): రైతులంటే తెలియని రాబందు చంద్రబాబునాయుడు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఎద్దేవా చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర యంలో ఏర్పాటు చేసిన విలేఖర్లతో సమావేశంలో ఆయన మాట్లాడారు. పనికిమాలిన చంద్రబాబు ఇటీవల సీఎం జగన్మోహనరెడ్డికి లేఖ రాశారని, రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరాడన్నారు. దేశ్ కీ నేత దేవినేని ఉమా పది మంది టీడీపీ కార్యకర్తలను తీసుకెళ్ళి ధాన్యానికి డబ్బులు రావడం లేదని ఫొటోలకు ఫోజులిస్తున్నాడన్నారు. పది రోజుల కిందట ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ధాన్యం బకాయిల చెల్లింపులపై స్పష్టంగా చెప్పామన్నారు. ఈ నెల 15 వ తేదీ నాటికి రూ. 1,600 కోట్లు విడుదల చేస్తున్నామని, 25 వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు వస్తాయని చెప్పామన్నారు. నెలాఖరు లోపు పూర్తిగా బకాయిలన్నీ చెల్లిస్తామని స్పష్టం చేశామన్నారు. చెప్పినట్టుగానే రైతుల అకౌంట్లకు రూ.1,600 కోట్లు జమ చేశామన్నారు. కేంద్రం నుండి రావాల్సిన రూ.5,056 కోట్లలో గత సోమవారం రూ .2,800 కోట్లు వచ్చాయన్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ. 3,200 కోట్లు వారి అకౌంట్లలో జమ చేశామన్నారు. వారం, పది రోజులుగా సేకరిస్తున్న ధాన్యానికి సంబంధించి ఆన్‌లైన్ సమస్యల వల్ల ఇవ్వలేకపోయామని , వచ్చే రెండు, మూడు రోజుల్లో మిగతా రెండు, మూడు వందల కోట్ల బకాయిలను చెల్లిస్తామన్నారు . సీఎం జగన్ ఒక మాట చెప్పారంటే ఆరునూరైనా, తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమరన ఉదయించినా ఆ మాటను నెరవేర్చడానికి ప్రాణాలైనా ఇస్తారన్నారు. రైతుల కష్టాన్ని, పండిన పంటను దోచుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదన్నారు. రాష్ట్ర సంపదను ఏదో విధంగా రైతులకు, పేదలకు వాళ్ళ అవసరాలకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు , దేవినేని ఉమా లాంటి వెధవల మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తారన్నారు. చంద్రబాబు, ఉమాలాంటి వెధవలు ఎంత మంది వచ్చినా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉపేక్షించి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఉమా లాంటి లోఫర్లు, జోకర్లు నమ్ముకుని రోడ్డు మీదకు వచ్చి అతి చేస్తే ఇబ్బందులకు గురవుతారన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఉన్న టీడీపీ బాగుపడేది లేదు, చచ్చేది లేదన్నారు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని, టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడన్నారు. వచ్చే ఆరు నెలలు, సంవత్సరంలోనే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ లో సెటిల్ అవుతాడన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ఏ రకంగా గాలికొదిలేసి అతని అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్చాడో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీని గాలికొదిలి అవసరమైతే సింగపూర్, మలేషియా పోవడానికి సిద్ధమవుతాడన్నారు. గాలినాయుడును నమ్ముకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి చిల్లర కార్యక్రమాలు చేస్తే పోలీసు యంత్రాంగం పెట్టే కేసులకు ఇబ్బందులు తప్పవన్నారు. వ్యక్తుల మధ్య వైషమ్యాలు, విద్వేషాలను సృష్టించాలనుకునే శక్తులు అల్లర్లతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చూస్తే కింద కాళ్ళ దగ్గర నుండి తల వరకు పగిలిపోతాయన్నారు. పిచ్చి వేషాలు వేయొద్దని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, దేవినేని ఉమా వెనుక తిరిగే కార్యకర్తలను మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Comments