కృష్ణా జిల్లాలో ఈ నెల 22 నుండి సర్పంచ్ లకు గ్రామ పంచాయితీ పరిపాలన వ్యవహారాలపై శిక్షణ*



విజయవాడ (ప్రజా అమరావతి);



 *కృష్ణా జిల్లాలో ఈ నెల 22  నుండి సర్పంచ్ లకు గ్రామ పంచాయితీ పరిపాలన వ్యవహారాలపై  శిక్షణ* 


 *జూలై 22 నుంచి ఆగస్టు 7వ తేది వరకు  778 సర్పంచ్ లకు  బ్యాచ్ లు వారీగా శిక్షణ*


 *ఒక్కో బ్యాచ్ కు 3 రోజులు చొప్పున  పరిపాలన సామర్ధ్య పెంపుపై శిక్షణ*   


 *కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ కార్యక్రమం* 

 

 *కృష్ణా జిల్లా కలెక్టర్ జె.  నివాస్* 


 జిల్లాలో నూతనంగా ఎన్నికైన 778 మంది గ్రామ పంచాయతి సర్పంచులకు  గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవహారాల పై ప్రాధమిక అవగాహన శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి ఆగష్టు 7వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. 


ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ సర్పంచ్ లకు నిర్దేశించిన తేదీల్లో హాజరై గ్రామ పంచాయతీ పాలన పై పూర్తి అవగాహన పొందాలని కలెక్టర్ జ్.నివాస్ సర్పంచ్ లను కోరారు.


 ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా  మచిలీపట్నం డివిజన్ కు  సంబంధించి  194 మంది సర్పంచ్ లకు 5 బ్యాచ్ లుగా, నూజివీడు డివిజన్ కు సంబంధించి 223 మంది సర్పంచ్ లకు  5బ్యాచ్ లుగా,విజయవాడ డివిజన్ కు సంబంధించి 169 మంది సర్పంచ్ లకు 3 బ్యాచ్ లుగా,గుడివాడ డివిజన్ కు సంబంధించి 192 మంది సర్పంచ్ లకు 4 బ్యాచ్ లుగా విభజించడం జరిగిందన్నారు.


 40 నుండి 90 మందితో బ్యాచ్ లను ఏర్పాటు  చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు మూడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని  అన్నారు.  


విజయవాడ డివిజన్ కు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలలోను,  నూజివీడు  డివిజిన్ వారికీ  నూజివీడు ట్రిపుల్ ఐటీ లోను, మచిలీపట్నం డివిజన్ వారికి మచిలీపట్నం, చిలకలపూడిలోని జడ్పీ ఆఫీస్ మీటింగ్ హాల్లో, గుడివాడ డివిజన్ వారికి గుడివాడ ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్లో   శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  


శిక్షణకు అవసరమగు            సామాగ్రిని,  టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను  సిద్ధం చేయడం జరిగిందన్నారు.   


శిక్షణలో ప్రధానంగా   గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత,  పంచాయతీల విధులు, అధికారాలు బాధ్యతలు, లక్ష్యాలు,  మౌలిక సదుపాయాల కల్పన లో  గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు,  సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ  ఉంటుందన్నారు. 


 *కోవిడ్ నిబంధనలు తప్పనిసరి* :


శిక్షణ కు హాజరయ్యే  సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, ఎవరికైనా జ్వరం ఉంటే పంపించి వేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.. శిక్షణలో  భౌతిక దూరాన్ని  పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా  తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు.


Comments