అనంతపురం, జూలై 21 (ప్రజా అమరావతి);
అనంతపురం జిల్లాలో ఈ నెల 22 నుండి సర్పంచ్ లకు గ్రామ పంచాయితీ పరిపాలన వ్యవహారాలపై శిక్షణ
*జూలై 22 నుంచి ఆగస్టు14 వ తేది వరకు 894 సర్పంచ్ లకు బ్యాచ్ లు వారీగా శిక్షణ*
*ఒక్కో బ్యాచ్ కు 3 రోజులు చొప్పున పరిపాలన సామర్ధ్య పెంపుపై శిక్షణ*
*కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిక్షణ కార్యక్రమం*
జిల్లాలో నూతనంగా ఎన్నికైన 894మంది గ్రామ పంచాయతి సర్పంచులకు గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవహారాల పై ప్రాధమిక అవగాహన శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి ఆగష్టు 14వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వ రాజన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ సర్పంచ్ లకు నిర్దేశించిన తేదీల్లో హాజరై గ్రామ పంచాయతీ పాలన పై పూర్తి అవగాహన పొందాలని కలెక్టర్ కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా అనంతపురం డివిజన్ కు సంబంధించి 366మంది సర్పంచ్ లకు 20 మండలాలకు సంబంధించిన రాప్తాడు మండలంలోని మోడల్ స్కూల్ నందు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కదిరి డివిజన్ కు సంబంధించి 148 మంది సర్పంచులకు, 12 మండలాలకు సంబంధించిన వారికి కదిరి పట్టణంలో కమ్మర వాండ్ల పల్లి SPACE ఇంగ్లీష్ స్కూల్ మీడియం పాఠశాల నందు శిక్షణా కార్యక్రమాలు జరుగుతుంది, ధర్మా వరండివిజన్ సంబంధించి ధర్మవరం పట్టణంలో కస్తూరిబాయ్ పాఠశాల నందు శిక్షణా కార్యక్రమాలు 82 మంది సర్పంచులకు, 6 మండలాలకు సంబంధించిన శిక్షణ నిర్వహించడం జరుగుతుంది.పెనుగొండ డివిజన్ సంబంధించిన 147 సర్పంచులకు, 13మండలాల పెనుగొండ పట్టణంలోని సత్య సాయి డిగ్రీ కళాశాల నందు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ్ దుర్గండివిజన్ సంబంధించి కళ్యాణ దుర్గంపట్టణంలోని కస్తూరిబాయ్ పాఠశాల నందు 151 మందు సర్పంచులకు, 12 మండలాలకు సంబంధించిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
40 నుండి 50మందితో బ్యాచ్ లను ఏర్పాటు చేయడమైందని, ఒక్కో బ్యాచ్ కు మూడేసి రోజుల చొప్పున శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు
శిక్షణలో ప్రధానంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత, పంచాయతీల విధులు, అధికారాలు బాధ్యతలు, లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పన లో గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు, సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందన్నారు.
*కోవిడ్ నిబంధనలు తప్పనిసరి* :
శిక్షణ కు హాజరయ్యే సర్పంచులందరికి ధర్మల్ స్కానర్ తో పరీక్షించాలని, శిక్షణలో భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలను పాటించడమే కాకుండా, శిక్షణ లో కోవిడ్ పై కూడా తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపారు.
addComments
Post a Comment