పనజి (ప్రజా అమరావతి):
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కడితే ప్రతినెలా 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్
అందిస్తామని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాగ్దానం చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
రెండ్రోజుల క్రితం గోవా వచ్చిన కేజ్రీవాల్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్ అనేది ఎన్నికల్లో తమ పార్టీ ఇస్తున్న తొలి హామీ అని చెప్పారు.
గోవాలో 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని, ఈ స్కీమ్ అమలుతో గోవాలో 87 శాతం మంతి లబ్ధి పొందుతారన్నారు.
పాత బకాయిలను రద్దు చేస్తామని, 24 గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు.
ఢిల్లీ ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నప్పుడు, గోవా ప్రజలకు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
గోవా విద్యుత్ మిగులు రాష్ట్రమైనప్పటికీ తరచు విద్యుత్ కోతలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
addComments
Post a Comment