*వాణిజ్య సముదాయాలను కాపాడుకునేందుకు 80 అడుగులకు కుదించాం.*
*రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.*
*పలాస కాశీబుగ్గ కెటి రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ తో పరిశీలించిన మంత్రి.*
*టి.డి.ఆర్ సర్టిఫికేట్ లు ఇచ్చి ఆదుకుంటాం.*
*త్వరితగతిన పనులు పూర్తి కావాలి.*
పలాస జులై 20 (ప్రజా అమరావతి):
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న కెటి రోడ్ విస్తరణ లో వాణిజ్య సముదాయాలు దెబ్బతినకూడదనే ముఖ్య ఉద్దేశంతో రోడ్డు విస్తీర్ణము 80 అడుగులకు కుదించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తో కలసి కెటి రోడ్డు పనులు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఏఫ్.ఏం.బి ప్రకారం 100 అడుగుల రోడ్డు విస్తీర్ణం ఉన్నప్పటికి వ్యాపారుల ఇబ్బందులు గుర్తుంచుకుని వారి వాణిజ్యానికి ఇబ్బంది లేకుండా అటు ప్రజా రవాణాకు ఇబ్బంది ఎదురుకాకుండా 80 అడుగులు విస్తీర్ణంతో రోడ్డు నిర్మించాలని అనుకున్నామని అన్నారు. ఈ విషయం స్థానిక ప్రజలు, వ్యాపారులు గమనించాలని కోరారు. భవిష్యత్తు అవసరాలకు రోడ్లు ఆధునీకరణ ఎంతో అవసరం ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం పట్టణ అభివృద్ధి పరిధిలో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏ ఒక్కరి ఇబ్బందులు ఎదురవ్వకుండా పనులు జరిపేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. రోడ్డు విస్తీర్ణ పనుల్లో ఎవరైతే స్థలాలు, భవనాలు కోల్పోతున్నారో వారికి టి.డి.ఆర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. టి.డి.ఆర్ సర్టిఫికెట్ ఇవ్వడం వలన సంబందిత వ్యక్తి స్వంత స్థలంలో మొదటి అంతస్తు వరకు టౌన్ ప్లానింగ్ అప్రువల్ పొందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లోని ఎక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. టి.డి.ఆర్ వలన టౌన్ ప్లాన్ అఫ్రువల్ వెసులుబాటు కల్పించడం ఎంతో శుభపరిణామం అంటూ తెలిపారు.అంతే కాకుండా అవసరం లేని వాల్లు టి.డి.ఆర్ ను వేరే వాల్లకు అమ్ముకునే అవకాశం కూడా కల్పించామని అన్నారు. కెటి రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేస్తే పట్టణం సుందరంగా కనిపిస్తుందని అన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత మంది విమర్శలు చేస్తుంటారని. వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని గమనించాలని కోరారు. ఇళ్ళు ఇప్పకుండా ఇళ్లు నేసేది ఎలా అని వెనుకటికి ఒక సామెత ఉండేదని అన్నారు. మన ఇళ్లు మనం బాగు జేసుకోవాలంటే అడ్డంకులు తొలగించాలి అనేది మరచి పోతున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ నాడు వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధి, నేడు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి స్థాయి అభివృద్ధికి దారులు వేస్తున్నామని అన్నారు. రోడ్డు విస్తీర్ణం పనుల్లో భాగంగా ప్రజలు స్వచ్చందంగా తొలగించుకోవడం చూస్తే వారి ప్రతినిధిగా హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. తొలగించే సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి రెండు రోజులు ఉంటాయని నిర్మాణ పనులు జరిగి పూర్తి అయిన తరువాత పట్టణం చూస్తే సుందర వాతావరణం కనిపిస్తుందని తెలిపారు. మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి చెందడం వలన మనకు అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని గమనించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తోపాటు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ , పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్, కాశీబుగ్గ డిఎస్పీ, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment