జగ్గంపేట (ప్రజా అమరావతి); రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు తదితరులతో కలిసి జగ్గంపేట మండలంలోని రాజపూడిలో రూ. 333.97 లక్షల ఖర్చుతో నిర్మించనున్న 8 కిలోమీటర్ల రాజపూడి-భూపతిపాలెం రోడ్డు, రూ.114.50 లక్షలతో నిర్మాణం జరగనున్న1.65 కిలోమీటర్ల మేకలగొంది-భూపతిపాలెం రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం జగ్గంపేటలో రూ.90 లక్షల ఖర్చుతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, కంప్యూటర్, సిబ్బంది తదితర గదులను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జగ్గంపేట తహసీల్దార్ వై.సరస్వతి, జగ్గంపేట సర్పంచ్ బచ్చల నాగరత్నం, రాజపూడి సర్పంచ్ బూసాల విష్ణుమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment