గుడివాడ డివిజన్లో 935 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం

 


- గుడివాడ డివిజన్లో 935 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాం


 

- 1.28 శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ శాతం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూలై 29 (ప్రజా అమరావతి): గుడివాడ డివిజన్ లో శుక్రవారం ఒక్కరోజే 935 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో 70 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా ఇద్దరికి వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందన్నారు. ముదినేపల్లి మండలంలో 121 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా ముగ్గురికి, మండవల్లి మండలంలో 53 మందికి పరీక్షలు జరుపగా ఒకరికి, గుడివాడ రూరల్ మండలంలో 65 మందికీ పరీక్షలు జరుపగా ఒకరికి, పెదపారుపూడి మండలంలో 142 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, గుడ్లవల్లేరు మండలంలో 97 మందికి పరీక్షలు జరుపగా ఒకరికి, కైకలూరు మండలంలో 103 మందికి పరీక్షలు జరుపగా ఒకరికి కరోనా వైరస్ సోకిందన్నారు. నందివాడ మండలంలో 43 మందికి, పామర్రు మండలంలో 133 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా ఏ ఒక్కరికీ కరోనా వైరస్ సోకలేదని తెలిపారు. కాగా గుడివాడ డివిజన్లో పాజిటివిటీ 1.28 శాతానికి తగ్గిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments