ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన యునైటెడ్‌ టెలిలింక్స్‌ నియోలింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కార్బన్‌ మొబైల్‌ బ్రాండ్‌) ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసిన యునైటెడ్‌ టెలిలింక్స్‌ నియోలింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కార్బన్‌ మొబైల్‌ బ్రాండ్‌) ప్రతినిధులు.


రూ. 2,150 కోట్ల పెట్టుబడితో (రూ. 650 కోట్లు మొబైల్స్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌, రూ. 1500 కోట్లు సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 6 వేలకు పైగా ప్రత్యక్షంగా, 15 నుంచి 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సీఎంకి వివరించిన కంపెనీ ప్రతినిధులు.

ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన యూటీఎన్‌పీఎల్‌ (కార్బన్‌ మొబైల్‌ బ్రాండ్‌). ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రముఖంగా ఉన్న యూటీఎల్, నియోలింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి తిరుపతి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొప్తర్తిలోని వైఎస్‌ఆర్‌ ఈఎంసీలో ఫ్యాక్టరీలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎంకి వివరించిన కంపెనీ ప్రతినిధులు.

స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్స్, ఫీచర్‌ మొబైల్‌ ఫోన్స్, సెట్‌టాప్‌ బాక్స్‌లు, టెలికాం ప్రొడక్ట్‌లు, చార్జర్స్, ప్లాస్టిక్స్‌ ఫర్‌ మొబైల్స్, ఐటీ హార్డ్‌వేర్, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను తయారుచేయనున్న కంపెనీ.

ఈ సందర్భంగా సీఎంని కలిసిన యూటీఎల్‌ చైర్మన్, డైరెక్టర్‌ సుధీర్‌ హసీజ, నియోలింక్‌ గ్రూప్‌ చైర్మన్‌ రువెన్‌ షెబెల్, గోల్డెన్‌ గ్లోబ్‌ ఎండీ రవికుమార్, వైఎస్‌ఆర్‌ ఈఎంసీ సీఈవో నందకిశోర్‌ రెడ్డి.

Comments