చలో తాడేపల్లికి అనుమతి లేదు: అర్బన్ ఎస్పీ
గుంటూరు (ప్రజా అమరావతి) : ఈ నెల 19న తలపెట్టిన చలో తాడేపల్లికి అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ప్రకటించారు. తాడేపల్లి పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని, ఆందోళన చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆరీఫ్ హఫీజ్ హెచ్చరించారు. జాబ్ జాబ్ క్యాలెండర్ సాధనకు ఈ నెల 19న చలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమానికి పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళనలకు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి.
addComments
Post a Comment