మహిళల భద్రత, రక్షణ కోసం అనేక రకాల చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

 మహిళల భద్రత, రక్షణ కోసం అనేక రకాల చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*


*మహిళల భద్రత కోసం దిశ ఎస్ఓఎస్ యాప్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి*


*: శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*


అనంతపురం, జూలై 23 (ప్రజా అమరావతి): 


*మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. నార్పల పట్టణంలోని కేజీబివి బాలికల పాఠశాలలో శుక్రవారం దిశ ఎస్ఓఎస్ యాప్ ప్రత్యేకత, అప్లికేషన్ డౌన్లోడ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2020లో దిశా చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఇందులో భాగంగా దిశా పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం, మహిళా పోలీసుల ద్వారా పెట్రోలింగ్ వాహనాల ఏర్పాటు, వారికోసం ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ టీమ్లను ఏర్పాటు చేయడం లాంటి వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. సచివాలయాలలో కూడా మహిళా పోలీసును నియమించడం జరిగిందని, మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుందన్నారు. దిశ ఎస్ఓఎస్ యాప్ ను మహిళలు, వారి కుటుంబ సభ్యులైన తండ్రి, భర్త, అన్నలు లాంటివారు ఎవరైనా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడైనా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటే యాప్ ను ఉపయోగించాలని, యాప్ ని కదిలించినా, ఎమర్జెన్సీ కాల్ చేసినా వెంటనే కనెక్ట్ అయిపోతుందని, యాప్ ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆసరా, చేయూత లాంటి వివిధ పథకాల ద్వారా మహిళల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. సచివాలయాల్లో ఉద్యోగులు, అంగన్వాడి వర్కర్లు, వాలంటీర్లలో సగం మంది వరకు మహిళలను నియమించడం జరిగిందని, మహిళలకు భద్రత కల్పించాలని దిశ యాప్ ను తీసుకురావడం జరిగిందన్నారు. దిశా యాప్ ను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ రోజు 200 మంది మహిళలు దిశ ఎస్ఓఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు.*


*మహిళల భద్రత కోసం దిశ ఎస్ఓఎస్ యాప్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి*


*ఈ సందర్భంగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశ ఎస్ఓఎస్ యాప్ మహిళల కోసం ప్రవేశ పెట్టారన్నారు. మహిళలకు చెప్పుకోలేక సమస్యలు ఎన్నో ఉంటాయని, ఎన్నో పరిస్థితుల్లో వారి ఇబ్బందులకు గురవుతారని, మహిళల కోసం దిశ ఎస్ఓఎస్ యాప్ ఏర్పాటు చేశారని, ఈ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ను నొక్కిన వెంటనే ఆరు నిమిషాల లోపు రెస్పాండ్ అవుతారని, మహిళలను రక్షిస్తారన్నారు. మహిళలు ఎవరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదని, ఎప్పుడు అవసరమైనా మహిళలంతా దిశ ఎస్ఓఎస్ యాప్ ను ఉపయోగించవచ్చన్నారు. అన్ని వయసుల వారు దిశ ఎస్ఓఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, తల్లిదండ్రులు, ఇతరులకు చెప్పుకోలేని సమస్యలను యాప్ ద్వారా తెలియజేయవచ్చునని, దీంతో వెంటనే వారికి రక్షణ లభిస్తుందన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా మహిళలు ఏ సమస్యనైనా తెలియజేయవచ్చన్నారు. దిశ యాప్ లో ఎస్ఓఎస్ లో ఉన్న ఫ్యూచర్స్, ఎమర్జెన్సీ సిస్టం ఎలా పనిచేస్తుంది అనే వివరాలను తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి మహిళల భద్రత కోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మహిళా రిసెప్షన్ సెంటర్ లు, సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు వ్యవస్థ, గ్రామాల వారిగా పెట్రోలింగ్ చేస్తున్న దిశా పెట్రోలింగ్ వాహనాలు, జిల్లా కేంద్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతొందన్నారు. జిల్లాలో 3 లక్షల 50 వేల మంది వరకు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందన్నారు. దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నోకియా వెంటనే జీపీఎస్ ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. మహిళల కోసం పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశామని, సచివాలయంలో మహిళా పోలీస్ ను నియమించామన్నారు. జిల్లాలో 61 పెట్రోలింగ్ వాహనాలను, మహిళా మిత్ర కమిటీలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి ఆదేశాలతో మహిళల రక్షణ విశిష్ట సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామన్నారు.*


*ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి మాట్లాడుతూ దిశ ఎస్ఓఎస్ యాప్ ను మహిళలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డిఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు, వాలంటీర్లకు తదితరులకు దిశ ఎస్ఓఎస్ యాప్ లింక్ ను పంపించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి మంది దిశ ఎస్ఓఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా లక్ష్యం నిర్ణయించారని, మహిళలందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించాలని సూచించారు.*


*అనంతరం జిల్లా కలెక్టర్, శింగనమల ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలు కేజీబివి బాలికల పాఠశాలలో నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. 


*ఈ అవగాహన కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి, నరసింహారెడ్డి, డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, సర్పంచ్ సుప్రియ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.*Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image