అమరావతి (ప్రజా అమరావతి);
*3 ఏళ్ళలో 55వేల ఐ.టీ ఉద్యోగాలు : ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
ఐ.టీ, ఎలక్ట్రానిక్ పాలసీ అమలుపై ఆరా తీసిన మంత్రి గౌతమ్ రెడ్డి
ఐ.టీ రంగంలో ఉన్నతశ్రేణి ఉద్యోగాలను యువతకు అందించాలన్నదే లక్ష్యం
విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాటుపై మంత్రి మేకపాటి దిశానిర్దేశం
అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు
ఐ.టీ, ఎలక్ట్రానిక్ ప్రమోషన్ ను మరింత పెంచాలని మంత్రి ఆదేశం
ఎన్ని ఉద్యోగాలివ్వగలమన్నది నైపుణ్య, శిక్షణ ఎంత మందికి ఇచ్చామన్నదానిపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి
అందుకు తగిన సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దష్టి పెట్టాలని మంత్రి వెల్లడి
ఐ.టీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు
సీవోఈల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలి
భవిష్యత్ లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు
ఐ.టీ, మానుఫాక్చరింగ్ కంపెనీలతో శాఖపరమైన చర్చలు, ఫాలోఅప్ దశల గురించి మంత్రి చర్చ
ఏయే మానుఫాక్చరింగ్ కంపెనీలతో సంప్రదింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మంత్రికి వివరించిన వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీ సీఈవో నందకిశోర్వి విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షకి హాజరైన ఐ.టీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఐ.టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు
addComments
Post a Comment