నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు అనేది ఒక మహాయజ్ఞం

 *నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు అనేది ఒక మహాయజ్ఞం**: పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు*


అనంతపురం, జూలై 27 (ప్రజా అమరావతి) :


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద జగనన్న కాలనీలలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణం ఒక మహా యజ్ఞం లాంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న డిపిఆర్సీ భవనంలో నవరత్నాలు - పేదలందరికీ ఇల్లులో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిలతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి నిర్వహించారు. అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాత్రికేయులతో మాట్లాడారు.*


*ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు కడుతున్నామని, 17 వేల కాలనీలను నిర్మిస్తున్నామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలలో నెలకొన్న పరిస్థితులను స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో తెలుసుకుని సమస్యలని పరిష్కరించేందుకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్, మెటల్ లకు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్ నుంచి మంత్రుల వరకు మరియు పంచాయతీ సెక్రటరీ నుంచి జిల్లా యంత్రాంగం వరకు అందరూ పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.* 


*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని, భారతదేశంలో నాలుగు ఇళ్లు నిర్మిస్తే అందులో ఒక ఇల్లు మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఐదు కుటుంబాలకు ఒక ఇల్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13 వేల పంచాయతీలు ఉండగా, కొత్తగా 17 వేలకుపైగా గ్రామాలు, నగరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగనన్న కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు, పెద్ద లేఔట్లలో ఆసుపత్రులు, అంగన్వాడి సెంటర్, పాఠశాల భవనాలు, బస్టాండు లాంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామాల్లో ఉన్నమాదిరి మౌలిక వసతుల కల్పన కోసం 30 వేల కోట్ల రూపాయలకుపైగా వెచ్చిస్తున్నామన్నారు. జిల్లా పర్యటనలు ముగిసిన అనంతరం లేఔట్లను పరిశీలించి లబ్ధిదారులతో, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి అక్కడున్న సమస్యను పరిష్కరిస్తామని, లేఔట్లలో ఉన్న ప్రతి ఒక్క ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలను 100 శాతం పూర్తి చేస్తామని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి 15 లక్షల రూపాయల ఆస్తిని సృష్టించి ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ, రోడ్ల నిర్మాణం, వసతుల కల్పన త్వరితగతిన చేపడుతున్నామన్నారు.*


*గత ప్రభుత్వాలు ఇంటి పట్టా ఇచ్చి పట్టించుకునేవారు కాదని, ఈరోజు భూసేకరణ జరిగిన వెంటనే రోడ్లు వేయడం, కరెంట్, నీళ్లు ఇవ్వడం, మెటీరియల్ ను తక్కువ ధరలకు సరఫరా చేయడం, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించి లబ్ధిదారులకు ఎటువంటి భారం కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే ఇల్లు మరి కొంచెం పెద్దది కట్టుకుంటాము, 2 బెడ్రూం లేదా ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటామనే వారికి వెసులుబాటు కల్పించి అవసరమైతే బ్యాంకులతో మాట్లాడి అదనపు నిర్మాణాలకు రుణాలు ఇప్పిస్తామన్నారు. ఇల్లు అనేది 100 సంవత్సరాలు ఉండేదన్నారు. పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణం చేసి బ్రహ్మాండమైన ఇల్లును, ప్రైవేట్ లేఔట్లలో, పట్టణాల్లోని ఇల్లు మాదిరిగా అభివృద్ధి చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి అందించే సలహాలు స్వీకరిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న ఇళ్ల నిర్మాణం అనే యజ్ఞంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు నిరుపేదలకు ఇల్లు కట్టించే భాగ్యం వచ్చిందని, ఇది పూర్వ జన్మ సుకృతం అన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని, ఏ లబ్ధిదారుల నుంచి పట్టా వెనక్కి తీసుకోమన్నారు. ప్రభుత్వం, అధికారులు, లబ్ధిదారులతో కమిటీలు ఏర్పాటు చేసి 20 ఇళ్లకు ఒక అధికారిని పెట్టి ప్రభుత్వ పర్యవేక్షణలో ఇళ్లు కడుతున్నామన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కి ఇళ్ల నిర్మాణం పై పూర్తి అవగాహన ఉందని, వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగిందని, ప్రతి ఒక చిన్న సమస్యను కూడా వారు పరిష్కరించడం జరుగుతుందన్నారు. మరొకసారి తాను జిల్లా పర్యటనకు వస్తానని, లేఔట్లను తిరిగి లబ్ధిదారులతో మాట్లాడడం జరుగుతుందని, ఇసుక , ఇతర వసతులు వారి గుమ్మం వద్దకే అందించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఇల్లు కట్టుకునేలా చేస్తామని మంత్రి తెలిపారు.*


*ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, సబ్ కలెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.Comments