విస్తృతంగా దిశా యాప్ డౌన్ లోడ్ చేయించి అవహహన కల్పిస్తున్న దిశా పోలీసులు.

 తిరుపతి అర్బన్ జిల్లా( ప్రజా అమరావతి);


తిరుపతి అర్బన్ జిల్లా యస్ పి శ్రీ వెంకట అప్పల నాయుడు ఐపీ యాస్ గారి ఆదేశాల మేరకు మహిళలను, విద్యార్థినిలను చైతన్య పరిచి వారికీ భద్రతే ప్రధాన కారణంగా దిశా యాప్ డౌన్ లోడ్ కార్యక్రమాల దిశా పోలీసులు చెప్పట్టారు.


విస్తృతంగా దిశా యాప్ డౌన్ లోడ్ చేయించి అవహహన కల్పిస్తున్న దిశా పోలీసులు.


అవగహణ కార్యక్రమములో పాల్గొన్న దిశా పోలీసులు.


నగరంలోని మహిళల వసతి గృహాలు, వాణిజ్య సముదాయాలు, హాస్టల్స్, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలోని మహిళలకూ దిశా పోలీసులు వారి మొబైల్ ఫోన్లకు దిశా ఆప్ డౌన్ లోడ్ చేయించి భద్రతా పరమైన అవశ్యకతను తెలియ పరిచారు.


స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి యువతి, మహిళ దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.


ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు.


 యాప్‌ ద్వారా బాధితులు ఉన్న

 లొకేషన్‌ వివరాలు నేరుగా కంట్రోల్‌ రూం, పోలీస్‌స్టేషన్‌కు చేరేలా పటిష్ఠమైన కార్యాచరణ.


ఈకార్యక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ యస్ఐ అరుణ మరియు సిబ్బంది  పాల్గొన్నారు..

Comments