ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై చర్చించి, పరిష్కరించవలసిందిగా


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవిన్యూ సమస్యలపై చర్చించి, పరిష్కరించవలసిందిగా


అధికారులను కోరిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వారానికో రోజు గ్రామాల వారీగా ప్రజలకు ఉన్న రెవిన్యూ పరమైన సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం.


 చుక్కల భూముల సమస్యలు, ప్రభుత్వ భూములుగా నమోదైన పట్టా భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం.


 కోవిడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే రద్దు కావడంతో, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.


 ప్రజల సమస్యలు విని వెళ్లిపోవడం కాకుండా, ప్రతి ఒక్క సమస్యను నమోదు చేసుకొని, ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం.


 ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో పాటు, వ్యక్తిగత సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని, పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాం.

Comments