అనాధ బాలుడుకి పది లక్షల డిపాజిట్ అందించిన

 అనాధ బాలుడుకి పది లక్షల డిపాజిట్ అందించిన


 


రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. 


పలాస: జులై 15 (ప్రజా అమరావతి) : 



కోవిడ్  రెండవ దశ  వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో  అందించారు.  శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి  స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించారు.  పది లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్థానిక పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో డొక్కరి దానయ్య, బత్తిన లక్ష్మణరావు, మామిడి సింహాద్రి, సొర్ర డిల్లీరావు లు పాల్గొన్నారు.

Comments