రైతుకు సాగు నీరు అందించే దిశగా పనిచేయాలి

 *రైతుకు సాగు నీరు అందించే దిశగా పనిచేయాలి


.*


రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. 


నీటి పారుదల శాఖ అధికారులను సూచించిన మంత్రి


నీటి పారుదల అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి.


పలాస: జులై 19 (ప్రజా అమరావతి):


రైతుకు సాగునీరు అందించే దిశగా పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి  డాక్టర్ సీదిరి అప్పలరాజు నీటి పారుదల అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి కార్యాలయంలో నీటి పారుదల అధికారులతో సమీక్షించిన మంత్రి నియోజకవర్గంలోని రిజర్వాయర్లు పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మందస మండలంలో ఉన్న డబారుసింగి, కళింగదల్, దామోదర సాగర్, సంకుజోడి రిజర్వాయర్లు ఆధునీకరణ పనులు పరిస్థితి సమీక్షించారు. రైతుకు పూర్తి స్థాయిగా పంటకు నీరు అందించాలంటే రిజర్వాయర్లు మరమ్మత్తులు పూర్తి చేస్తే తప్ప నీరు అందించే పరిస్థితి లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు. వాస్తవానికి  ఎగువ ప్రాంతం నుండి నీరు పంట పొలాలకు చేరే వరకు ఉన్న నీటి కాలువలు పరిస్థితి ఎలా ఉంది అని మంత్రి అధికారులను అడిగారు. నీటి కాలువలు, లింక్ చానేల్లు పూర్తి స్థాయిగా  మరమ్మత్తులు చేపడితే రైతుకు నీరు అందుతుందని  ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు. వంశధార కాలువల నుండి నీరు శివారు ప్రాంతాలకు అందేలా చూడాలని అన్నారు. వంశాధార కాలువ నుండి వచ్చిన నీరు ప్రతి చెరువులో నింపగలిగితే రైతుకు సాగు నీరు అందించే వాల్లం అవుతామని తెలిపారు. రైతుకు నీరు అందించే విదంగా కృషి చేయాలని కోరారు. రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు మరమ్మత్తు పనులు పూర్తి చేసి నీటి నిలువాలు పెంచాలని కోరారు. వర్షపు నీరు వడిసి పట్టేలా ఉండాలి కానీ సముద్రం పాలు చేసే పరిస్థితులు ఉండకూడదని ప్రభుత్వం రైతుకు అన్ని సంక్షేమ పధకాలు అందించినా సాగురు అందించ లేకపోతే  రైతు పరిస్థితి  చెప్పలేనిదని అన్నారు.  కాబట్టి సమృద్ధిగా పంటలు పండాలంటే  చెరువుల్లో సమృద్దిగా నీటి నిల్వలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఇ సుధాకర్, ఇ.ఇ శ్రీనివాసులు, డి.ఇ రమేష్, ఎ.ఇ లు శ్రీనివాసరావు, పాణిగ్రాహి, మధు పాల్గొన్నారు.