*డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే నేను అన్న ప్రమాణానికి ఏడాది పూర్తి
.**
*మంత్రిగా ఏడాది పూర్తి.*
*పలాస అభివృద్దే లక్ష్యంగా రాజకీయాల్లోకి.*
*రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా.*
*శాసనసభలో తనదైన శైలి.*
*అధికార ప్రతినిధిగా వాగ్ధాటి.*
పలాస : జులై 21 (ప్రజా అమరావతి):
డాక్టర్ అప్పలరాజు అనే నేను అనే మాటతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం ముగిసింది. జగనన్న ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వం అధికార ప్రతినిధిగా, ఏడాదిలో రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేసిన నాయకుడు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖ లకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు జులై 22 వ తేది. పలాస నియోజకవర్గం ప్రజలు డాక్టర్ సీదిరి అప్పలరాజును నాయకుడిగా నమ్మి అభివృద్ది బాటలో నడిపించే నాయకుడు తూరుపు దిక్కున పొద్దు పొడుపులా వచ్చినట్లు బావించి 2019 ఎన్నికల్లో పలాస ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభ కు పంపించారు. ఎన్నికల్లో ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పలాస నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ది సాదించే దిశగా నేడు ప్రయాణం చేస్తుంది. నాయకుడంటే ప్రజల కష్టాలు తెలుసుకునే వాడుగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించి అంచెలంచలుగా ఎదిగిన నాయకుడు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల ద్వారా ప్రజలకు మేలైన పధకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పలాస అభివృద్దికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని మెప్పించి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించిన ఘనత కూడా మంత్రిదే. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పలాస చేరి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు , ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ రోగులను ఆదుకోవడానికి ఏకంగా రెండు వందల పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ కేంద్రం 50 కోట్ల రూపాయలు నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. అదే రోజు ఉద్దాన ప్రజలకు ఇంటింటికి సుద్దజలం అందించేందుకు 7 వందల కోట్ల రూపాయలతో మంచి నీటి ప్రాజెక్టు శంకుస్థాపన ఘనత డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మాత్రమే చెల్లింది. అంతే కాకుండా పలాస నియోజకవర్గం ప్రజల ,విద్యార్ధుల దశాబ్ధ కాలాల కల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలాంటి కళాశాలకు ప్రభుత్వ అనుమతులు తెచ్చారు. పలాస ప్రాంత ప్రజల నిత్యం నరకవయాతన గా మారిన కాశీబుగ్గ ఫ్లై ఓవర్ రోడ్డు నిర్మాణం. ఎన్నో అడ్డంకులు గత పాలకుల నిర్లక్ష్యం వాటిని అధిగమించి నిర్వాసితులను ఒప్పించి నేడు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పూర్తి స్థాయిగా అభివృద్ధి చెంది సుందర మున్సిపాలిటీగా రూపు దిద్దేందుకు పావులు కదుపుతూ ముందుగా కెటి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం చేయడం వ్యారస్తులను ఒప్పించడం. బెండిగేటు నుండి కోసంగిపురం వరకు డబుల్ రోడ్డు. అక్కుపల్లి వజ్రపుకొత్తూరు రోడ్డు 30 కోట్ల రూపాయలతో విస్తరణ 60 శాతం పనులు పూర్తి, నువ్వలరేవు టెక్కలిపట్నం వయా బెండిగేటు రోడ్డు 25 కోట్ల రుపాయలతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. మందస మండలంలో గ్రామాలకు రోడ్లు సౌకర్యం చేయించడం తోపాటు మందస పట్టణంలో 100 అడుగుల వెడల్పుతో రొడ్డు విస్తరణ చేసి త్వరలో ప్రజలకు అంకితం చేయబోతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు పి.హెచ్.సి లు, సి.హెచ్.సి లు ఆధునీకరణ కు నిధులు విడుదలజేసి పనులు చేపట్టే విధానం రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకే చెల్లింది. వాస్తవంగా అరవై సంవత్సరాలుగా అభివృద్దికి నోచుకోని పలాస నియోజకవర్గంలో మందస, పకాస, వజ్రపుకొత్తూరు మండలాలు నేడు అభివృద్ధి బాటలో నేడు ముందుకు పోతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యే తో మంత్రితో తమ సమస్యలు చెప్పుకునే స్థాయికి వచ్చారు. గత పాలకులు ప్రజల సమస్యలు వినే పరిస్థితి లేదు కానీ నేడు ప్రజల వద్దకే మంత్రి వెల్లి సమస్యలు వింటుండటం నియోజకవర్గంలో ప్రజలు తమ నాయకుడుగా హృదయాలకు హత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పధకం రాజకీయాలకు అతీతంగా అందిస్తున్నారు. కష్టాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ అందరికి అన్నగా రాజన్నగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నది మొదలు ఆయా శాఖలలో అభివృద్ధి బాటలొఇ నడిపారు. రాష్ట్రంలో అక్కచెల్లమ్మలకు ఆర్ధిక భరోసా కలిగించేందుకు ఏపి అముల్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించి పాల ఉత్పత్తులను పెంపిందించి గ్రామీణ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేశారు. జీవ క్రాంతి పేరిట గ్రామీణ ప్రజల్లో వ్యాపార అభివృద్ధి ని మెరుగుపరిచారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చెందే దిశగా ప్రణాళికలు చేసి వాటిని అమలు చేస్తున్నారు. స్వతహాగా మత్స్యకార కుటుంబం నుండి రాజకీయాల్లోకి రావడంతో మత్స్యకార కుటుంబాలు ఒడుతున్న కష్టాలు తెలిసిన మనిషిగా అదే శాఖ కి మంత్రి కావడంతో మత్స్యకార కుటుంబాలకు పెద్దన్నలా చేదోడు వాదోడుగా వున్నారు మత్స్యకార భరోసా అందిస్తూ వారి జీవన విదానంలో సమూక మార్పులు తీసుకు వచ్చారు. ఫిషరీస్ హబ్ లు రాష్ట్రంలో ఏర్పాటు చేసి మత్స్య సంపద పెంచడం తోపాటు మార్కెటింగ్ వెసుల బాటు కల్పించే విదంగా సచివాలయాల వద్దనే మార్కెటింగ్ కేంద్రాల నిర్మాణం చేసేందుకు రూపకల్పన. పలాస నియోజకవర్గం నువ్వలరేవు, మంచినీళ్ళపేట వద్ద ఫిష్సింగ్ జట్టి ఏర్పాటుకు పనులు ప్రారంభించి వారి జీవితాలకు వెలుగునిచ్చిన నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు. పలాస నియోజకవర్గం ఒక పారిశ్రామిక వాడగా మారాలి అనేది ఆయన కల ఆ కలలొఇ భాగంగా పారిశ్రామిక అభివృద్ధి కి ఎన్నో ప్రణాలికలు రూపొందించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ప్రత్యర్ధుల్లో ధడ పుట్టించే నాయకుడు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాలంటే స్పష్టమైన మాట తీరు విషయం పై విశ్లేషణ ఆయనకే చెల్లు అందుకే రాష్ట్రంలో ఏ విషయంపైనైనా మాట్లాడేందుకు మాధ్యమాలు సైతం మంత్రి డాక్టర్ అప్పలరాజునే ముందుగా ఎంచుకుంటారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆయన రాజకియాల్లోకి వచ్చింది మొదలు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఏడాది పరిపాలనా అంచలంచలుగా ప్రజా ప్రయోజనకారిగా మిగిల్చాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల ఆశయ సాధుకుడుగా నిలిచారు. నమ్మిన సిద్దాంతం కోసం పని చేసే ఏకైక నాయకుడు. పలాస అభివృద్ధి సాధకుడు రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజల గుండెల్లో నుండి వచ్చిన మాట.
addComments
Post a Comment