తాడేపల్లి (ప్రజా అమరావతి):
రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ పర్యవేక్షణలో మిషన్ డైరెక్టర్ MEPMA శ్రీ ఎన్. తేజ్ భారత్, I.A.S Livelihoods & Entrepreneurship Acceleration Plan (LEAP) పై ఒకదిన కార్యాగ్రామాన్ని 2025 ఏప్రిల్ 9న తాడేపల్లిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించారు.
కెపాసిటీ బిల్డింగ్ దిగ్గజాలైన ఇండియా SME ఫోరం అధ్యక్షుడు శ్రీ వినోద్ కుమార్ వూతూ మరియు డైరెక్టర్ జనరల్ శ్రీమతి సుష్మ మోర్ధానియా జీవనోపాధుల స్తితి గతులు మరియు వ్యాపార మెళుకువలు, ప్రతి ఇంటికి ఒక వ్యాపార వేత్త ఉండాల
నే లక్ష్యం తో ఈరోజు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించే దిశగా అవకాశాల మాపింగ్ మరియు కార్యాచరణ పథకం గురించి మిషన్ డైరెక్టర్ MEPMA శ్రీ ఎన్. తేజ్ భారత్, I.A.S తెలియచేశారు.
మెప్మా మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల లోని మహిళలు 7 లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లో ఉన్నారు వీరిలో చాలా మంది పచ్చళ్ళు తయారు చేసేవారు, పేపర్ ప్లేట్స్ తయారు చేసేవారు, పూజా సామాగ్రి తయారు చేసేవారు, సబ్బులు తయారు చేసేవారు ఉన్నారు అయితే వీరికి బ్రాండింగ్ మీద మార్కెటింగ్ మీద వారి యొక్క వస్తువులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి వారి ఇంకా ఆర్థికంగా ఎంత వృద్ధి చెందాలి దానిమీద వారికి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు.
గత తొమ్మిది నెలల్లో స్వయం సహాయక సంఘాలకు 16 వేల కోట్ల రుణాలు అందించాము మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ భాగంలో మార్కెటింగ్ వారికి సుస్థిరమైనటువంటి జీవనోపాధి మరియు నిరంతర అభివృద్ధి చెందాలని మరియు లీప్ ప్రాజెక్ట్ అనేది టైం బాండ్ ప్రాజెక్ట్ అని జూన్ 8 కల్లా పుస్తకం ప్రచురితమవ్వాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్రం లో మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారాన్ని SHG ప్రొఫైలింగ్ APP ద్వార 99% అనగా 2,74,078 గ్రూప్ లు 28,74,000 సభ్యులు ద్వారా సంఘటితం చేసి వారి సామాజిక ఆర్ధిక సాధికారత కొరకు కృషిచేస్తున్నాము. దీనిలో భాగంగా సంఘాలు మరియు సమైఖ్యల కార్యకలాపాలు పూర్తిస్థాయి పారదర్శకంగా నిర్వహించి తద్వారా సంఘ సభ్యుల ఆర్ధిక వికాసానికి తోడ్పడేటందుకు జీరో-పావర్టీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికలు రూపొందించేందుకు ఈ Livelihoods & Entrepreneurship Acceleration Plan (LEAP) వర్క్ షాప్ ఉపయోగపడుతుంది.
ఇండియా SME ఫోరం ముఖ్య ఉద్దేశం సంఘాల కెపాసిటీ బిల్డింగ్ కరికులమ్‌ను అభివృద్ధి చేయటానికి, పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలు, జీవనోపాధి అవకాశాలను విశ్లేషించేందుకు, మరియు సామర్థ్యవంతమైన జీవనోపాధి మరియు వ్యాపారోత్పత్తికి అనువైన పరిస్థితులను సృష్టించడానికి సామర్థ్యవృద్ధి చర్యలు, సాధారణ సదుపాయ కేంద్రాలు (CFCs), హెల్ప్ డెస్క్‌లు మరియు వ్యాపార శిబిరాల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారిని సబలీకరించేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు ఇండియా SME ఫోరం ఉపయోగపడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో 30,000 మంది మహిళా పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేయాలి. అందులో అంతకుముందు నుంచే వ్యాపారం చేస్తున్న 10 వేల మంది మహిళలకు మరింత శిక్షణ ఇప్పించి అత్తుత్తమ వ్యాపారవేత్తలుగా మరియు 20 వేల మంది మహిళలను కొత్త వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చేయాలి అని మెప్మా మిషన్ డైరెక్టర్ గారు ఇండియా SME ఫోరం ప్రతినిదుల కోరారు.
పట్టణ ప్రాంతాల్లో లాభదాయక ఉపాధి మరియు ఉద్దీపనభరితమైన వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా, ఇండియా SME ఫోరం ప్రతినిధులు అవకాశాల మాపింగ్ మరియు కార్యాచరణ పథకాన్ని ప్రస్తావించనున్నారు.
ఈరోజు జరిగిన ఈ కార్యాగ్రామంలో మెప్మా ఉన్నతాధికురులు, తిరుపతి, జివిఎంసి మరియు వి.యం.సి ప్రాజెక్ట్ డైరెక్టర్లు, టీఈలు, సిఎంఎంలు, సిఒలు పాల్గొన్నారు.
addComments
Post a Comment