- మంత్రి కొడాలి నాని సమక్షంలో ఘనంగా మెరుగుమాల కాళి పుట్టినరోజు వేడుకలు
గుడివాడ, జూలై 24 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మెరుగుమాల కాళి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లో మెరుగుమాల కాళితో మంత్రి కొడాలి నాని కేక్ ను కట్ చేయించి తినిపించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ పార్టీ నేత మెరుగుమాల కాళి పుట్టినరోజు వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని దేవుని ప్రార్థించారు. పార్టీ నేత అద్దేపల్లి పురుషోత్తం మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని సమక్షంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో నేత బర్నబాస్ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. మంత్రి కొడాలి నాని బర్నబాస్ తో కేకును కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మెరుగుమాల కాళి పుట్టినరోజు వేడుకలు గుడివాడ పట్టణంలోని చిన్న కార్ల స్టాండ్, కార్మికనగర్, ముగ్గుబజార్, ముబారక్ సెంటర్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున అభిమానుల సమక్షంలో మెరుగుమాల కాళి ఘనంగా జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లో కేళ్లను కట్ చేసి అభిమానులకు పంచారు.
addComments
Post a Comment