అమ్మ, అన్నమయ్య ట్రస్టులకు వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ రూ.లక్ష విరాళం

 _*అమ్మ, అన్నమయ్య ట్రస్టులకు వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ రూ.లక్ష విరాళం


*_


గుంటూరు జూలై, 24 (ప్రజా అమరావతి): గుంటూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ వెంకటేష్ కన్స్ట్రక్షన్స్  శనివారం వేదవ్యాస జయంతి సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్, బృందావన్ గార్డెన్స్ లోని శ్రీవెంకటేశ్వర స్వామి రిలీజియస్ సొసైటీకి చెందిన అన్నమయ్య ట్రస్ట్ లకు యాభై వేల రూపాయల చొప్పున విరాళం అందించారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని,  అదేవిధంగా అన్నమయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి చేయూతనందించేందుకు గాను ఈ మొత్తాన్ని అందజేసినట్లు వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పులివర్తి శేషగిరి రావు వెల్లడించారు. శనివారం ఉదయం డాక్టర్ పులివర్తి వెంకటేష్, కమలేష్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పులివర్తి కమలేష్ ఈ విరాళాన్ని అన్నమయ్య ట్రస్ట్ అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య ద్వారా అందించారు.