శంఖవరం గ్రామం లో నూతనంగా నిర్మించిన గాంధీ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవ

 

శంఖవరం (ప్రజా అమరావతి);

శంఖవరం గ్రామం లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునర్ నిర్మించుకోవడం శుభ పరి నామమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మాత్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు.


శుక్రవారం శంఖవరం  గ్రామం లో నూతనంగా నిర్మించిన గాంధీ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవ


కార్యక్రమంలో మంత్రులు వేలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు స్థానిక శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శంఖవరం గ్రామంలో గాంధీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ  మహనీయుల త్యాగాలు మరచిపోకూడదని వారి త్యాగాలను సార్థకత చూపే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అందులో భాగంగా శంఖవరం ఆర్యవైశ్య సోదరులు

విగ్రహాన్ని పునర్ నిర్మించడానికి ముందుకు రావడం స్వాగతించవలసిన విషయమని పేర్కొన్నారు.

 ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రవర్ణాల  లో ఉన్న పేద వారికి రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రులు శ్రీనివాసరావు ,కురసాల కన్నబాబు తెలిపారు.

 అగ్రవర్ణాల లో ఉన్న ప్రతి పేద వర్ణాల వారికి ఈ రిజర్వేషన్లు వర్తించే విధంగా వారిలో ఉన్న పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్ లో కల్పించనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.

 అర్హత ఉండి ప్రతి కుటుంబానికి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కులమతాలకు అతీతంగా ప్రభుత్వం ఫలాలు అందేవిధంగా గత రెండు సంవత్సరాల నుండి మంచి ఫలితాలు చూస్తున్నామన్నారు. చెప్పిన మాట ప్రకారం పథకాలు అమలుపరచటం తోపాటు కరోనా కష్టకాలంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్కిందని పేర్కొన్నారు.

  ఈ సందర్భంగా శంఖవరం  మెయిన్ రోడ్ లో మహాత్ముని విగ్రహం పునరుద్ధరించి ప్రారంభించడం పట్ల వైశ్య సోదరులు ముందుకు రావడం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభినందించారు.  

అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు లు ప్రారంభించారు. 

 ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర రావు ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్నవరం సత్యదేవుని ఆలయంలో అత్యాధునిక వసతులతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కల్పించడం జరిగిందన్నారు. 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం దీనిని పునరుద్ధరించడానికి ప్రత్తిపాడు నియోజకవర్గ  ఆర్యవైశ్య సేవా సంఘం ప్రతినిధులు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

 

Comments