చంద్రబాబుకు ఘన స్వాగతం.చంద్రబాబుకు ఘన స్వాగతం. గన్నవరం, జూలై 27 (ప్రజా అమరావతి): హైదరాబాద్ నుంచి ప్రతేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. 

 మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. 

 చంద్రబాబు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే కార్యకర్తలు "జై బాబు.. జై అమరావతి" లతో నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు చంద్రబాబుకు వినతి పత్రాలను అందజేశారు. 

 అనంతరం పార్టీ ముఖ్య నాయకులు చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు.

 చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, మచిలీపట్నం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బోడే ప్రసాద్, కార్యదర్శి జూపల్లి సురేష్, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి,  గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ఉంగుటూరు మండల అధ్యక్షుడు ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుఖ్,  విజయవాడ రూరల్ మండలం ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబురావు, కార్యదర్శులు గరిమెళ్ళ నరేంద్ర చౌదరి, బొమ్మసాని అరుణ కుమారి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ శ్రవణ్, పార్టీ నాయకులు మారుపూడి ధన కోటేశ్వరరావు, బచ్చుల బోస్, నిమ్మకూరి మధు, చెన్నుపాటి గాంధీ, దేవినేని చందు, మండవ అన్వేష్, వల్లూరి కిరణ్, ఉప్పలపాటి ప్రవీణ్, పెందుర్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments