సామాజిక న్యాయమే ప్రభుత్వ ద్వేయం

 విజయవాడ (ప్రజా అమరావతి);



సామాజిక న్యాయమే ప్రభుత్వ ద్వేయం 



సంక్షేమ పధకాల అమల్లో దేశానికి ఆదర్శం 


రైతుల భాగస్వామ్యంతో పారదర్శకమైన సహకార వ్యవస్థ -మంత్రి కన్నబాబు 


సామాజిక న్యాయం అమలు చేస్తూ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి  సీఎం జగన్  జనరంజకంగా పాలన సాగిస్తున్నారని  రాష్ట్ర వ్యవసాయ, సహకార , మార్కెటింగ్, ఫుడ్ ప్రోస్సేసింగ్ శాఖల మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. శుక్రవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలోకృష్ణా జిల్లా డిసిసిబి నూతన పాలక వర్గంతో  ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. 


ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో సామజిక న్యాయం అమలవుతోందనటానికి  ఈ డిసిసిబి నూతన పాలకవర్గం ఎన్నిక నిదర్శనమన్నారు .

అన్ని సామాజిక వర్గాలకు సమకాలీన న్యాయం మన సీఎం జగన్ ద్యేయమని ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు .


అవినీతి రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు , నాణ్యమైన సేవలను అందించే  లక్ష్యంతో  ముందుకు వెళుతున్నట్టు మంత్రి తెలిపారు .


 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు.

సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రము దేశానికే ఆదర్శగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు . శాఖా పరంగా వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు 

సహకార శాఖలో సంస్కరణలు చేపడుతూ సహకార బ్యాంకులను  బలోపేతం చేస్తున్నామన్నారు.

 రైతుల భాగస్వామ్యంతో  పూర్తి పారదర్శకత కలిగిన వ్యవస్థను తయారు చేస్తున్నామన్నారు


నిధుల దుర్వినియోగాన్ని, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించమనని ఆయన స్పష్టం చేశారు . సహకార శాఖలో ఆడిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు .

ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటిల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేబడుతున్నామన్నారు .

అబ్కాబ్లో నూతన మానవ వనరుల పాలసీని అమలు చేస్తున్నామన్నారు .వాణిజ్య బ్యాంకులతో పోటీపడేలా మన సహకార బ్యాంకుల సేవలు విస్తృతం చేయాలనని ఆయన అభిలాషించారు . 

నాబార్డు వారి  నాబ్కాన్స్ సంస్థ ఆధ్వర్యంలో  సహకార శాఖ బలోపేతానికి అమలు చేయాల్సిన కార్యాచరణను  సిద్ధం చేస్తున్నామన్నారు . అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు .

కృష్ణా జిల్లా డిసిసిబి సుమారు రూ .7200 కోట్ల టర్నోవర్ తో  పురోగతి సాధిస్తోందన్నారు .

 ఈ  సహకార కేంద్ర బ్యాంకుకి మంచి చరిత్ర వుంది మరెంతో ఉన్నతమైన భవిష్యత్తు వుందన్నారు. ఈ కార్యక్రమంలో 

ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు , కైలీ అనిల్ కుమార్, జోగి రమేష్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి , మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు , రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ,

కృష్ణ జిల్లా డిసిసిబి నూతన ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు , ఇతర సభ్యులు , వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments