నైపుణ్య యువతే రాష్ట్ర భవిత: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



అమరావతి (ప్రజా అమరావతి);


నైపుణ్య యువతే రాష్ట్ర భవిత: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



నైపుణ్య యువాంధ్రప్రదేశ్" దిశగా వడివడిగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు : ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


యువతీ,యువకులందరికీ వరల్డ్ స్కిల్ యూత్ డే శుభాకాంక్షలు.


'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం' అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి. మన రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తగు శిక్షణను అందించాలనేదే ధ్యేయం.



యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందజేయడాలన్నదే ప్రభుత్వ సంకల్పం.


ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించినా  నెంబర్ వన్ స్కిలింగ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.


2లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు"ల్లోకెక్కిన ఏపీ.


ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో రూ.30కోట్లతో 'స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ' ఏర్పాటుకు శంకుస్థాపనతో కీలక ముందడుగు.


రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్ - సప్లైల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా కృషి చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ కు ఈ సందర్భంగా శుభాభినందనలు.


రాష్ట్ర ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులదే కీలకమైన పాత్ర.


నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తుందని ముందే గుర్తించడం  ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం.


 రేపటి  భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతీ ఏడాదీ జూలై 15న 'ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం' నిర్వహించుకోవడం సముచితం.


నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు.


ఆ నైపుణ్యాన్ని ఉచితంగా యువతకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం బాటలు.


ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవులు కావాలో చెప్పండి మేమే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరులు సమకూరుస్తామనేలా ప్రత్యేక దృష్టి.


ఉపాధి కల్పన లక్ష్యంగా లోక్ సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు.


రాష్ట్రవ్యాప్తంగా ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్కటి చొప్పున 4 స్కిల్ కాలేజీలు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 30 నైపుణ్య కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ1,385 కోట్లను వెచ్చించేందుకు సన్నద్ధం.


7 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ తీసుకొని 156 ప్రముఖ ఎమ్ఎన్ సీ  కంపెనీలలో ఉపాధి పొందిన యువత 4,500 మంది.


2021-22లో 5వేల మందికి ఒక్క ఓమ్ క్యాప్ ద్వారా ఉపాధి అవకాశాలు అందించాలనేది లక్ష్యం.


స్కిల్ కాలేజీలలో యువతీ, యువకులు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ..24 జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు.


ఆ జాబితాలో ఐబీఎమ్,టెక్ మహీంద్రా,హెచ్ సీఎల్,బయోకాన్, ఒరాకిల్ తదితర ప్రముఖ సంస్థలు.


ప్రతి స్కిల్ కాలేజ్ లో పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'లకు శ్రీకారం.


పరిశ్రమలలో స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు అందించేందుకూ శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



Comments