సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం



*సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం


*


అమరావతి (prajaamaravati);


*ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కార్యక్రమం*


*పులుల సంరక్షణకోసం తీసుకున్న చర్యలను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వివరించిన అధికారులు*

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపిన అధికారులు

గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని తెలిపిన అధికారులు

నల్లమలనుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు

కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపిన అధికారులు


*పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం ఆదేశం*

టైగర్‌ రిజర్వ్‌ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు సీఎం అంగీకారం


పులుల దినోత్సవం సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. 


ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌  చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.