అమరావతి (ప్రజా అమరావతి);
రిజిస్ట్రేషన్ శాఖ లో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసులు పరిష్కారం పై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. రజత్ భార్గవ ఐఏఎస్ గారు ఈ రోజు, ఆ శాఖ ప్రధాన కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులనూ త్వరితగతిన పరిష్కరించి తీసుకున్న
చర్యలను ఉన్నత న్యాయస్థానాలకు నివేదించవలసిందిగా ఆదేశించారు.
శాఖ పనితీరులో పారదర్శకత, అవినీతి నిర్మూలన పై దృష్టి సారించాలని శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న స్థానాల పై న్యాయస్థానాలలో ఉన్న కేసులను పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుని, ఖాళీలు నింపవలసిందిగా ఇన్స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు.
ప్రీమియం సేవలు అందించే నిమిత్తం ఎంపిక చేసిన నగరాలలో ఆధునిక వసతులతో కూడిన సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రారంభానికి సంబంధించి కార్యాచరణ రూపొందించాల్సిగా ఆదేశించారు. మొదటి విడతగా తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాలలో ఈ కార్యాలయాలు ప్రారంబానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
పదోన్నతి వదులుకున్న సిబ్బంది విదిగా వారు పని చేసే కార్యాలయాన్ని వదిలి వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లవలిసియుండునని తెలియజేశారు.
ఈ సమీక్షలో కమిషనర్ & ఐజీ శ్రీ.యం.వి.శేషగిరిబాబు ఐఏఎస్, అడిషనల్ ఐజీ శ్రీ. ఉదయభాస్కర రావు, జాయింట్ ఐజీ శ్రీ. వి. రవి కుమార్, జాయింట్ ఐజీ సరోజ, డీఐజీ నాగలక్ష్మి పాల్గొన్నారు.
addComments
Post a Comment