శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని

 
 


- శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని 


- అంతరాలయంలో వైభవంగా అభిషేక పూజలు గుడివాడ / ముదినేపల్లి, జూలై 19 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉ న్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారికి సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం అంతరాయలంలో అభిషేక పూజలు జరిపారు. పుట్టలో పాలు పోసి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కేవీ గోపాలరావు మంత్రి కొడాలి నానిని, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను, వడ్డీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ఎం గాయత్రీ సంతోషిలను శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం వేద పండితులు మంత్రి కొడాలి నానికి ఆశీర్వచనం అందించారు. సహాయ కమిషనర్ గోపాలరావు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు మండల ప్రముఖుడు అడవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.