ఏపీ సీడ్స్ కు జాతీయ అవార్డు
అధికారుల పనితీరుని ప్రశంసించిన మంత్రి కన్నబాబు
అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో తొలసారిగా రైతు విత్తనం రైతుకే దక్కుతుంది .. అదికూడా నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనం.... ఈ ఘనత సాధించిన రాష్ట్ర విత్తనాభివృద్ద్ది సంస్థ కు సామజిక బాధ్యత క్రింద జాతీయ అవార్డు దక్కింది....రాష్ట్రంలో 13 జిల్లాల్లో...సర్టిఫైడ్ విత్ట నాలను....రైతులకు సబ్సిడీపై ఖరీఫ్ సీజన్ కు ముందు గానే పంపిణీ చేసి ప్రభుత్వ రైతుల ఆదరణ చూరగొంది....సామాజిక బాధ్యత విభాగంలో జాతీయ అవార్డు దక్కినందు కు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది....
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా....రవాణా ఖర్చులు భారం లేకుండా ఉన్న ఊ ళ్లో నే విత్త నా లు అందాయి. 2019 నుంచి రాష్ట్రo లో 20 లక్షల మంది రైతులు ఈ విత్తన పంపిణీ వల్ల లబ్ధి పొందారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , కమిషనర్ అరుణ్ కుమార్ ,
సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర సిబ్బందిని అభినందించారు.
addComments
Post a Comment