రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణ

            నెల్లూరు, జూలై 16 (prajaamaravati):--రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణ


పథకానికి సంబంధించి జిల్లాలో నమోదు అయిన 39 వేల గృహాలకు రానున్న  వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 15 నాటికి స్లాబ్ వరకు పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె. వి. యన్ . చక్రధర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.     శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన ప్రాంగణంలో హౌసింగ్ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా విధులు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్లు    ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు వారివారి గృహాలలో చేరేంతవరకు ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా  ఉందన్నారు. నియోజకవర్గానికి ఒక మోడల్ హౌస్ ని నిర్మించి వారానికి ఒకసారి లబ్ధిదారులకు చూపించినట్లు అయితే వారికి అవగాహన పెరిగి త్వరితగతిన పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. లబ్ధిదారులందరూ స్వయం సహాయక గ్రూపు లో నమోదు చేసుకొని ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా స్వయం సహాయక గ్రూపులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని లబ్ధిదారులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని అందించేలా చూడవలసిన అవసరం ఉందన్నారు. ఇంకనూ మౌలిక వసతులు ఏర్పాటు చేయని లేఅవుట్లలో త్వరితగతిన అవసరమైన విద్యుత్తు ,నీరు   వంటి మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇళ్ల నిర్మాణం పనులలో పనిదినాలను కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లబ్ధిదారుల్లో అవగాహన పెంచవలసిన అవసరం ఉందన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక కొరత లేదని ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక తరలింపు విషయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండే విధంగా ఎస్ ఈ బి అధికారుల కు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు    ఆయన తెలిపారు. అవసరమైన ఇసుక, సిమెంటు ఇతర ముడి సామాగ్రిని ముందస్తుగా అందుబాటులో వుంచుకోవాలన్నారు. ప్రతి వారం గృహ నిర్మాణాలలో ప్రగతి   కనపడాలని స్పష్టం చేశారు. స్పెషల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి  చురుకుగా విధులను నిర్వహించాలన్నారు. ఆఫ్ లైన్ లో ఉన్న దరఖాస్తులను ఆన్లైన్లోకి మార్చాలని ఆయన సూచించారు. చెల్లించవలసిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా త్వరితగతిన బిల్లుల చెల్లింపులు సి ఎఫ్ ఎం ఎస్ ద్వారా జరుగుతుందని ఆయన సూచించారు. ప్రత్యేక అధికారులు తమ పనులను వేగవంతం చేసి గృహ నిర్మాణాలను    నిర్ణీత గడువు లోపల పూర్తి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్( హౌసింగ్) శ్రీ విదేహ్ ఖరే, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, హౌసింగ్ పిడి శ్రీఆది సుబ్రహ్మణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఈ శ్రీ రత్నం వివిధ శాఖల అధికారులతో పాటు హౌసింగ్ శాఖ డి ఈ, ఏ ఈ తదితర అధికారులు పాల్గొన్నారు.....